సడెన్ స్టార్‌కి రాజమౌళి అభినందనలు
హైదరాబాద్: సుడిగాడు చిత్రంతో సడెన్ స్టార్‌గా మారి హిట్టు కొట్టిన టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్‌కి దర్శకుడు రాజమౌళి అభినందనలు తెలిపారు. సుడిగాడు డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావుతో పాటు ఎంటైర్ టీంకు కంగ్రాట్స్ తెలిపారు. అల్లరి నరేష్ గత హిట్ చిత్రాల్లో టాప్ గ్రాసర్ కంటే 'సుడిగాడు' చితం రెండు రెట్లు అధిక వసూళ్లు సాధించాలని ఆకాంక్షిస్తూ రాజమౌళి ట్వీట్ చేసారు.
అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన 'సుడిగాడు' చిత్రం టాలీవుడ్ టాప్ హీరోలపై స్పూఫ్‌లు చేస్తూ రూపొందించారు. బాలయ్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ తదితర హీరోలకు పేరడీగా రూపొందించిన సన్నివేశాలు థియేటర్లో నవ్వులు పూయిస్తున్నాయి.
ఇటీవల విడుదలైన రవితేజ, బాలయ్య లాంటి టాప్ హీరోల సినిమాలను అధిగమిస్తూ సుడిగాడు చిత్రం ముందుకు సాగుతుండటం బాక్సాఫీసు వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం కలెక్షన్లు అంచనాలను మించి పోయాయి.
ఈచిత్రంలో చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం: శ్రీవసంత్, పాటలు: సిరివెనె్నల, చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: విజయ్ ఉలగనాథ్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: డి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications











