ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇంత సింపులా.. మరో వైరల్ న్యూస్!

Recommended Video

#RRR Movie Update:RRR Movie New Title Discussions Going On

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ ని రాజమౌళి భుజాలపైకి ఎత్తుకున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభం అయింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. రాజమౌళి ఈ చిత్ర విశేషాలేవి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ఈ చిత్ర టైటిల్ సింపుల్ గా ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయి.

పునర్జన్మల నేపథ్యంలో

పునర్జన్మల నేపథ్యంలో

ఈ చిత్ర కథ గురించి ఇప్పటికే అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. స్వాతంత్ర నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ స్వాతంత్ర సమరంలో మరణించి తిరిగి జన్మించి 2000 సంవత్సరం తర్వాత స్నేహితులుగా మారుతారట. ఇదే కథతో రాజమౌళి మ్యాజిక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రామ రావణ రాజ్యం

రామ రావణ రాజ్యం

ఈ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం రాజసం అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారట. కథానుగుణంగా ఈ రెండు టైటిల్స్ సరిపోతాయని అంటున్నారు. కానీ చివరకు రాజమౌళి ఏ టైటిల్ వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.

కొడుకు వివాహం

కొడుకు వివాహం

ఆర్ఆర్ఆర్ ఫస్ట్ షెడ్యూల్ ని చక చకా పూర్తి చేసిన రాజమౌళి తన తనయుడు కార్తికేయ వివాహ పనుల్లో బిజీగా మారాడు. ఇటీవల కార్తికేయ, పూజ వివాహం వైభవంగా జైపూర్ లో జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్, రానా, అఖిల్, జగపతి బాబు, అనుష్క లాంటి టాలీవుడ్ స్టార్స్ అంతా హాజరయ్యారు.

త్వరలో సెకండ్ షెడ్యూల్

వీలైనంత త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి రాజమౌళి ఇంకా వివరాలు ప్రకటించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X