స్టార్ లెస్ సినిమాకే కోటాను కోట్ల రాబడి రాజమౌళినా మజకా...
తెలుగు నిర్మాతలు ఎగబడి ప్రతి తమిళ సినిమానీ తెలుగులోకి అనువదించడానికి లక్షల లక్షల తగలేస్తుంటారు. ఇక కాస్త తెలిసున్న హీరో సినిమాకైతే కోటాను కోట్లు పోసేస్తుంటారు. కానీ తెలుగు సినిమాల్ని తమిళంలో విడుదల చేయడానికి అక్కడి వాళ్లు అంతగా ఆసక్తి చూపించరు. ఒకవేళ మన సినిమాలు అక్కడ అనువాదమైనా మహా అయితే మన నిర్మాతలకి కొంత చిల్లర దక్కుతుందంతే.. ఈ ట్రెండ్ లో ఓ స్టార్ లెస్ తెలుగు మూవీని తమిళంలో విడుదల చేయడానికి అయిదు కోట్లు చెల్లించేందుకు తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన అగ్ర నిర్మాన సంస్థ రెడీ అంటోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈగకే అంత డిమాండ్ ఏర్పడింది.
పెద్ద పెద్ద తారలు లేకున్న కానీ కేవలం రాజమౌళి బ్రాండ్ నేమ్ కే అంత డిమాండ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఈగ" చూడ్డానికి లో బడ్జెట్ సినిమానే అనిపిస్తున్నా రాజమౌళి ఈ చిత్రానికి కూడా భారీగానే ఖర్చు పెట్టిస్తున్నాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంతదాకా వచ్చిన దక్షిణాది చిత్రాలన్నిటినీ ఈగ తలదన్నేస్తుందనేది అతని అభిప్రాయం.


Click it and Unblock the Notifications











