Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొడుకు పెళ్ళిలో రాజమౌళి క్రియేటివిటీ.. ఫిదా అయిన జూ. ఎన్టీఆర్!
దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం వైభవంగా జరుగుతోంది. టాలీవుడ్ తారలు, రాజమౌళి బంధుమిత్రుల సమక్షంలో జైపూర్ లో కార్తికేయ, పూజ వివాహం జరగనుంది. మూడు రోజులపాటు జరిగే పెళ్లి వేడుకలో ప్రముఖ హీరోలు రాంచరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రానా, నాని ఇలా స్టార్ హీరోలంతా సందడి చేయనున్నారు. వీరంతా ఇప్పటికే జైపూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రస్తుతం ఇండియాలో టాప్ దర్శకులలో ఒకరు. కేవలం సినిమాల విషయంలోనే కాదు కొడుకు పెళ్లి విషయంలో కూడా రాజమౌళి క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు.
జైపూర్‌లోని ప్రైవేట్ హోటల్
కొన్ని రోజుల క్రితమే కార్తికేయ, పూజ నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. కార్తికేయ వివాహం జైపూర్ లోని విలాసవంతమైన ప్రయివేట్ హోటల్ లో జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళి, ప్రభాస్, రామా రాజమౌళి, అనుష్క సందడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కార్తికేయ వివాహం చేసుకోబోయే పూజ సినీ నటుడు జగపతి బాబు సోదరుడి కుమార్తె కావడం విశేషం.
రాజమౌళి క్రియేటివిటీ
సినిమాల్లో రాజమౌళి క్రియేటివిటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కుమారుడి పెళ్లి విషయంలో కూడా రాజమౌళి విభిన్నంగా ఆలోచించాడు. వివాహానికి హాజరైన అతిథులందరికి రాజమౌళి కుటుంబం స్టార్ హోటల్స్ లో బస ఏర్పాటు చేశారు. హోటల్ రూమ్ లోకి ప్రవేశించడానికి అవసరమైన కీ లాంటి కార్డుని ఏర్పాటు చేశారు. ఎవరి రూమ్ కార్డుపై వాళ్ళ ఫోటోలని జతచేయడం విశేషం. ఇది రాజమౌళి ఐడియా.
Poll: ఉత్తమ తెలుగు దర్శకుడు 2018
ప్రభాస్ సాహో
ప్రభాస్ రూమ్ కార్డుపై సాహో లుక్ ని జత చేశారు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నేచురల్ స్టార్ నానికి రూమ్ కార్డుపై తాం సతీమణితో ఉన్న ఫోటోని జత చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Poll: ఉత్తమ విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు 2018
ఫిదా అయిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇచ్చిన రూమ్ కార్డుపై అతడి ఫ్యామిలీ మొత్తం ఉంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి, పెద్ద కొడుకు అభయ్ రామ్, చిన్న కొడుకు భార్గవ్ రామ్ ఉన్నారు. ఈ కార్డుపై ఎన్టీఆర్ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో స్పందించాడు. ఇంతకంటే గొప్పది ఆశించనని ఇంస్టాగ్రామ్లో పేర్కొన్నాడు. మొత్తంగా రాజమౌళి తన కుమారుడు పెళ్లి వేడుక సందర్భంగా క్రియేటివిటీని బయట పెట్టాడు.