»   » బాహుబలి 2లో రాజమౌళి కూతురు కూడా నటిస్తోంది... (ఫోటో)

బాహుబలి 2లో రాజమౌళి కూతురు కూడా నటిస్తోంది... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి: ది బిగినింగ్‌'లో దర్శకుడు రాజమౌళి ఓ చిన్న అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. రెండో భాగంలో ఆయన తెరపై కనిపిస్తారా? లేదా? అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ లేదు కానీ... ఈ చిత్రంలో రాజమౌళి కూతురు మయూఖ నటిస్తుందనే విషయంలో మాత్రం ఓ క్లారిటీ వచ్చింది

తాజాగా విడుదలైన సాహోరే బాహుబలి సాంగ్ వీడియో ప్రమోలో మయూఖ పూలు చల్లుతూ కనిపించింది. మయూఖ మాత్రమే కాదు ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా పని చేసిన ప్రశాంతి కుమార్తె అనన్య, సంగీత దర్శకుడు కీరవాణి కుమార్తె కుముద్వతి, కెమేరామెన్‌ సెంథిల్‌ తనయులు రేయాన్‌, ధృవలు కూడా ఇందులో నటించారు.


ఈ ఫోటో చూసారుగా...

ఈ ఫోటో చూసారుగా...

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూసారా...... మయూకతో పాటు అనన్య, కుముద్వతి, రేయాన్, ధృవ తదితరులను గమనించవచ్చు.


సాహోరే బాహుబలి వీడియో సాంగ్

సాహోరే బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో నిన్న రిలీజ్ చేసారు. ఈ సాంగుకు అప్పుడే 2 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వ్యూస్ బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో...


మయూఖ ఫ్యూచర్ ప్లాన్స్

మయూఖ ఫ్యూచర్ ప్లాన్స్

పెద్దయ్యాక సింగర్ అవ్వాలని ఉందని, ప్రస్తుతం కర్నాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నానని మయూఖ తెలిపారు. మ్యూజిక్ లో పెద్దనాన్న కీరవాణి, హాలీవుడ్ లో రాక్ మై బ్యాండ్ ఇష్టమని మయూఖ తెలిపారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే విషయం మాకు కూడా తెలియదు, నాన్న చెప్పలేదు. స్కూల్ లో ఫ్రెండ్స్ కూడా ఈ విషయం గురించి అడుగుతుంటారు అని మయూఖ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


కార్తికేయ డైరెక్టర్ గా

కార్తికేయ డైరెక్టర్ గా

బాహుబలికి కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా చేసాడు. అప్పుడే అర్థమైంది.... కార్తికేయ దర్శకుడిగా సూట్ కాడని, డైరెక్టర్ కి ఉండాల్సినంత ఫోకస్ వాడికి లేదు. అందకే ప్రొడక్షన్ లో తన కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. చాలా కష్టపడతాడు కానీ ఒకే చోట కూర్చుని పనిచేయలేడు. సిచ్యుయేషన్స్ ను హ్యాండిల్ చేయడంలో కార్తికేయ బెస్ట్...అందకే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. కొన్ని సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు అని తన కుమారుడి గురించి రమ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


English summary
Rajamouli Daughter Mayookha Cameo in Baahubali 2 . Alongside Mayookha, designer Prashanthi’s daughter Ananya and Keeravani’s daughter Kumudhwathi are also seen hailing Baahubali in the song teaser.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu