చంద్రబాబు, ప్రభాస్ ఇష్యూ- రాజమౌళి ఖండన
తాజాగా ఈ రూమర్లపై రాజమౌళి స్పందించారు. చాలా అప్ సెట్ అయ్యారు. 'నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ చేయడమా?(దానర్థం ఏమిటి?), నేను ఆయనకు టిప్స్ ఇచ్చాననే వార్తలు పూర్తిగా అవాస్తవం' అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. అదే విధంగా తాను ప్రభాస్‌తో రూపొందించబోయే చిత్రానికి గాను 10 డజన్ల గుర్రాలు బుక్ చేసినట్లు వార్తల్లోనూ నిజం లేదని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు.
ప్రభాస్ తో తీయబోయే సినిమా గురించి రాజమౌళి ఇటీవల స్పందిస్తూ.... ఈ చిత్రం ఓ పీరియడ్ చిత్రం అని,చారిత్రికం మాత్రం కాదని తేల్చి చెప్పారు. ఇక అది ఓ జానపదం(ప్లోక్ స్టోరీ) అన్నారు. అంతేకాక సినిమా పునర్జన్మ మీద కాదనన్నారు. మగధీర,ఈగ వంటి కాన్సెప్టు కాదని తెలియచేసారు.
బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రాంక్ గా చెప్పాలంటే నాకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్.. ఏమీ ఈగ విడుదల అయ్యేదాకా రాలేదు. ఇప్పుడు వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ సౌత్ లో కొన్ని ఇప్పటికే ఒప్పుకున్న కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే బాలీవుడ్ ప్రయాణం అన్నారు. అఫ్ కోర్స్ ఓ స్టోరీ టెల్లర్ గా నా సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ ని రీచ్ అవ్వాలనే కోరుకుంటాను అన్నారు.


Click it and Unblock the Notifications












