నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రంపై రాజమౌళి ట్వీట్
రాజమౌళి ...తన తదుపరి చిత్రం హిందీ-తెలుగు బాషల్లో బైలింగ్వువల్ గా చేస్తానని అన్నారు. ఈగ హిందీ డబ్బింగ్ మక్కీ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అలాగే ఈ చిత్రం ఓ పీరియడ్ చిత్రం అని,చారిత్రికం మాత్రం కాదని తేల్చి చెప్పారు. ఇక అది ఓ జానపదం(ప్లోక్ స్టోరీ) అన్నారు. అంతేకాక సినిమా పునర్జన్మ మీద కాదనన్నారు. మగధీర,ఈగ వంటి కాన్సెప్టు కాదని తెలియచేసారు.
బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రాంక్ గా చెప్పాలంటే నాకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ ..ఏమీ ఈగ విడుదల అయ్యేదాకా రాలేదు. ఇప్పుడు వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ సౌత్ లో కొన్ని ఇప్పటికే ఒప్పుకున్న కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే బాలీవుడ్ ప్రయాణం అన్నారు. అఫ్ కోర్స్ ఓ స్టోరీ టెల్లర్ గా నా సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ ని రీచ్ అవ్వాలనే కోరుకుంటాను అన్నారు.
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. ఇక భారీ బడ్టెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించి ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications












