twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ఇలాంటి సినిమాలు కూడా తీయగలడా..??

    By Staff
    |

    ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ సినిమాగా విడుదలయ్యి టాలీవుడ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన సినిమా 'మగధీర'. డైరెక్టర్ మూవీగా రూపొందిన ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమాయే కాదు దర్శకుడు రాజమౌళి సినిమా అనగానే భారీగా రూపొందుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రూపొందించిన 'సింహాద్రి', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ' సినిమాలు చూస్తే అన్నీ భారీగా రూపొందినవే అని ఇట్టే అర్థమయిపోతుంది.

    అలాంటిది 'జక్కన్న' గా పిలువబడే రాజమౌళి ఈ సారి తన శైలికి భిన్నంగా అతి తక్కువ బడ్జెట్ తో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పిసిని గొట్టు అల్లు అరవింద్ తోనే 45 కోట్లు ఖర్చుపెట్టించిన రాజమౌళి ఈ సారి కేవలం 75 లక్షల రూపాయల బడ్జెట్ తో సినిమాను రూపొంచనున్నారని తెలిసింది. తను అనుకున్న కాన్సెప్ట్ కు ఇంతే ఖర్చు అవుతుందని రాజమౌళి తెలిపారు.

    ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఏ ఇతర వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి భారీ చిత్రాల దర్శకుడిగా అపజయమే ఎరుగని రాజమౌళి చిన్న సినిమాలు రూపొందించడంలో సక్సెస్ అవుతాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికి మనం రాజమౌళికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X