మన్మథునితో మరో మగధీర తీస్తానంటున్న రాజమౌళి..
ఇప్పటి వరకు స్టార్ హీరోల (చిరు, బాలయ్య, నాగ్, వెంకీ)తో సినిమాలు తియ్యని రాజమౌళి తాజాగా కింగ్ నాగార్జున తో ఓ చిత్రాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. నాగ్ తో చిత్రం చేయడానికి కథ కూడా సిద్దంగా ఉన్నదని, ఆ కథను నాగ్ కి కూడా వినిపించాడట. కథ నచ్చడంతో నాగ్ కూడా ఓకే చెప్పడంతో పాటు తన సొంత బ్యానర్ 'అన్నపూర్ణ స్టూడియోస్" లోనే ఈ చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడట. కథలో విషయం లేకపోతే..తన బ్యానర్ లో చేయని నాగ్ తన బ్యానర్ లోనే చిత్రాన్ని చేయాలనీ..అంటున్నాడంటే కథ కత్తిలా ఉండి ఉండాలి..అయినా రాజమౌళి కదా! కత్తిలా ఏంటి కత్తే..అయి ఉంటుంది. అందుకే నాగ్ కథ కూడా వినకుండా ఒకే చెప్పేశాడట.
అయితే చిన్న హీరోలతో పాటు యన్టీఆర్, రామ్ చరణ్ లతో బిగ్ హిట్స్ ఇచ్చిన రాజమౌళి. నాగ్ తో చేసే చిత్రంతో చాలా జాగ్రత్తగా ఉండాలి..ఈ చిత్రాన్నిఈ సంవత్సరం చిరలోకాని, 2011 స్టార్టింగ్ లో కానీ సెట్స్ మీదకు తీసుకెళతారని సమాచారం. ఈ చిత్రం యాక్షన్ ఎన్ టర్టైన్ మెంట్ చిత్రంగా రూపొందుతని సమాచారం. అయితే గతంలో డైరక్టర్ తేజ..మొదట్లో మంచి చిత్రాలు చేసి ఒక్కసారిగా మహేష్ బాబుతో చిత్రం చేసే అవకాశాన్ని సొంతం చేసుకుని..ఆ తర్వాత దిక్కు మొక్కు లేకుండా పోయాడు..మరి రాజమౌళి అలా కాకూడదని స్టార్ హీరో నాగార్జున తో చేసే చిత్రం మంచి గుర్తింపును తీసుకు రావాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











