రాజమౌళి ఆంక్షలు: అప్పటి వరకు ‘ఎన్టీఆర్’ అభిమానులకు కనిపించడా?

గత చిత్రం 'అరవింద సమేత'లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..... ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. తన గత చిత్రం కంటే భిన్నమైన లుక్‌లో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నారు. ఇందుకోసం లాయిడ్ స్టీవెన్స్ అనే జిమ్ ట్రైనర్‌ సమక్షంలో కసరత్తులు చేస్తున్నాడు.

గత సినిమాల విషయంలోనూ ఎన్టీఆర్‌కు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేసిన స్టెవెన్ లాయిడ్.... తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయంలో మాత్రం అలా చేయడానికి వీల్లేదంటూ రాజమౌళి ముందస్తుగా హెచ్చరించారట.

ఎన్టీఆర్‌కు రాజమౌళి ఆంక్షలు

ఎన్టీఆర్‌కు రాజమౌళి ఆంక్షలు

‘ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదయ్యే వరకు సస్పెన్స్‌గా ఉంచాలని డిసైడ్ అయిన రాజమౌళి అప్పటి వరకు పబ్లిక్‌లోకి రావొద్దని, ఎలాంటి ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని యంగ్ టైగర్‌పై ఆంక్షలు విధించారట.

ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడు?

ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడు?

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ అతడి పుట్టినరోజు సందర్భంగా మే 20, 2019న విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే మరో ఆరు నెలల వరకు యంగ్ టైగర్ అభిమానులకు కనిపంచే అవకాశం లేదు.

చివరగా ఓటు వేస్తూ కనిపించిన ఎన్టీఆర్

చివరగా ఓటు వేస్తూ కనిపించిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ చివరి సారిగా ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఓటు వేస్తూ కనిపించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన అనంతరం ఓటు వేయడానికి వచ్చిన ఆయన భారీగా గడ్డంతో దర్శనమిచ్చారు. దీన్ని బట్టి ‘ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్ గడ్డంతో కనిపించబోతున్నారనే విషయం స్పష్టమవుతోంది.

 ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్

కాగా.. ‘ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన ఫష్ట్ షెడ్యూల్ డిసెంబర్ 6న పూర్తయింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఈ చిత్రంలో ఇంకా ఎవరు నటిస్తున్నారు? అనే విషయాలు బయటకు రాలేదు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాముబలికి పని చేసిన సెంథిల్ కుమార్, కీరవాణి, సాబు సిరిల్ లాంటి వారు ఈ చిత్రానికి పని చేస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X