ఆ ‘ఈగ’ పై అనుమానం ఎగురుతుందో లేదో: రాజమౌళి
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి 'ఈగ" అనే ఒక ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడని మీడియాలో గత కొంత కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ ప్రస్తుతం తన 'ఈగ" ఎగురుతుందో లేదో(మొదలవుతుందో లేదో) అంటూ రాజమౌళి స్వయంగా అనుమానం వెలిబుచ్చాడు. ఆ చిత్రం ప్రారంభం పై నెలకొన్న సందిగ్ధత పై క్లారిఫికేషన్ ఇస్తూ రాజమౌళి ఈ రోజు 'ట్విట్టర్"లో నా ప్రయోగాత్మక చిత్రం 'ఈగ" గురించి బయట చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. మొదటగా, నేను ఆ సినిమా చేస్తానో లేదో నాకే సరిగా తెలియదు.
ఇక హాలీవుడ్ డీస్నీ పిక్చర్స్ కి 'ఈగ" కథ వినిపించాలని అనుకోవడం ఒక చిన్న ఐడియా మాత్రమే. వాళ్ళకి కథ వినిపించడం ఒక పెద్ద తతంగం. అంత సులువుగా 'డీస్ని" యాజమాన్యం తమ అంగీకారాన్ని తెలపదు. ఆ పక్షంలో, ముందు చెప్పినట్టుగా నేనే స్వయంగా నిర్మిస్తాను. కానీ..అది చాలా చాలా చిన్న ప్రయోగాత్మక సినిమా అవుతుంది. పైగా అది కేవలం కొన్ని సెలెక్ట్ చేసుకున్న థియేటర్లలో మాత్రమే విడుదల చేయబడుతుంది" అని రాశాడు.
చిన్నదో పెద్దదో… ఎప్పుడూ చూసే ఈ ఏడుపు-పెడబొబ్బలు… తన్నుకోవడాలు, పొడుచుకోవడాలు చూసి విసిగిపోయిన సగటు తెలుగు సినీ అభిమానుకు 'ఈగ" లాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఖచ్చితంగా పెద్ద ఊరటనిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











