నాని మూవీ షూట్‌లో... రాజమౌళి అండ్ ఫ్యామిలీ
గోవా: ఈగ సినిమా మూలంగా దాదాపు రెండు సంవత్సరాలు హాలీడేలకు దూరమైన రాజమౌళి ఎట్టకేలకు నిన్న.... ఫ్యామిలీతో కలిసి ఓ వారం రోజులు జాలీగా గడిపేందుకు గోవా బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారు గోవా చేరుకున్నారు. ప్రస్తుతం గోవాలో నాని హీరోగా సముద్ర ఖని దర్శకత్వంలో 'జెండాపై కపిరాజు' షూటింగ్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో గోవా వచ్చిన రాజమౌళి ఫ్యామిలీని నాని తన షూటింగ్ సెట్‍కు ఆహ్వానించాడు. ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజమౌళితో పాటు ఆయన భార్య రమ, కుమారుడు కార్తికేయ, ఇతర కుటుంబ సభ్యులు 'జెండాపై కపిరాజు' షూటింగ్ సెట్‌ని సందర్శించనున్నారు.
జెండాపై కపిరాజు చిత్రాన్ని వాసన్ విజువల్స్ వెంచర్స్ బ్యానర్‌పై కె.ఎస్. శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. అమలాపాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి పి.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో 'శంభో శివ శంభో', 'సంఘర్షణ' చిత్రాలు రూపొందించారు.
నాని మరో వైపు.. కృష్ణవంశీ దర్శకత్వంలో పైసా అనే చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











