థాయ్ భాషలో రాజమౌళి 'ఈగ'
హైదరాబాద్ : 'ఈగ'త్వరలో ధాయ్ లాండ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఈగ' తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు విదేశాలకీ ఎగరబోతోంది. థాయ్ భాషలోకి 'ఈగ' చిత్రాన్ని అనువదించబోతున్నారని సమాచారం. థాయ్‌లాండ్ దేశవాసులూ సినీప్రియులే కావటంతో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు.
భారత సంస్కృతికి దగ్గరగా ఉంటాయి వారి పద్ధతులు, అభిరుచులు. 'ఈగ'లోని సాంకేతిక మాయాజాలంతోపాటు ఆత్మ మరో ప్రాణిలోకి ప్రవేశించడం లాంటి అంశాలు థాయ్‌లాండ్ వాసులకు నచ్చుతాయనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. భారత చిత్రసీమ ఇన్నాళ్లూ ఆ దేశాన్ని షూటింగులకు అనువైన ప్రాంతంగా మాత్రమే భావించింది. ఇక థాయ్‌లాండ్‌ని ఓ మార్కెట్‌గా మలచుకోబోతున్నారు. ఆ దేశానికి చెందిన కొందరు ఎగ్జిబిటర్లు ఇప్పటికే పలువురు హిందీ నిర్మాతలతో ఒప్పందాలు చేసుకున్నారు... అనువాద హక్కుల కోసం. వచ్చే యేడాది నుంచి భారతీయ చిత్రాలు థాయ్‌లోకి అనువాదం కాబోతున్నాయన్న మాట.
'ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ' అంటూ రాజమౌళి సృష్టించిన సందడి బాక్సాఫీసుని కళకళలాడించింది. దాంతో ఈ చిత్రాన్ని ఇతర దేశాల్లోనూ రిలీజ్ చేసి మార్కెట్ చేయాలని నిర్మాత సురేష్ బాబు నిర్ణయించుకున్నారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం. ఇక ఈ చిత్రానికి సంగీతం కీరవాణి, స్టైలింగ్ ..రమా రాజమౌళి, ఛాయాగ్రహణం..సెంధిల్ కుమార్, సమర్ఫణ డి.సురేష్ బాబు


Click it and Unblock the Notifications











