‘ఆస్కార్’ అవార్డుల రేసులో ‘ఈగ’
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి రూపొందించిన గ్రాఫికల్ వండర్ చిత్రం 'ఈగ' అద్భుతమైన విజయం సాధించి సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది.
త్వరలో ఈచిత్రాన్ని భారత్ తరుపున ఆస్కార్ అవార్డుల నామినేషన్ కు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) సభ్యులు హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న 'ఈగ' స్పెషల్ షో తిలకించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డులుక నామినేట్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై పూర్తి వివరాలు తెలియనున్నాయి.
'ఈగ'ని హిందీలోకి డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ తేదిని అక్టోబర్ 12 కి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈగ తెలుగు వెర్షన్‌లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ స్టెప్పులేసింది. అయితే హిందీలోనూ అదే సీన్లు పెడితే అక్కడి ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున....బాలీవుడ్ టాప్ హీరోల డాన్స్ ను ఇమిటేట్ చేసేలా ఆ సీన్లను మోడరేట్ చేస్తున్నారు.
హిందీ వెర్షన్లో సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ల డాన్స్‌ను ఈగతో చేయిస్తారట. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











