తమిళంలో కూడా తన స్టామినాని చూపిస్తాడంట: రాజమౌళి
'మగధీర" చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ లో టాప్ స్టేజ్ కి చేరిపోయిన యస్ యస్ రాజమౌళి మర్యాదరామన్న తర్వాత 'ఈగ" అంటూ ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7న టాలీవుడ్ లో గ్రాండ్ గా ప్రారంభమైన 'ఈగ"..డిసెంబర్ 9న చెన్నైలోతమిళంలో కూడా స్టార్ట్ అయ్యింది. తెలుగులో దర్వకుడిగా తన స్టామినాని, తన జైత్రయాత్రని కొనసాగిస్తున్న రాజమౌళి..'ఈగ" తో తమిళ్ లో కూడా రాణించాలని అనుకుంటున్నాడట.
గత కొంత కాలంగా ఫంక్షన్స్ మాత్రమే పరిమితమైన రాజమౌళి..తిరిగి తన జాబులో బిజీగా మారనున్న తరుణంలో తెలుగు ప్రేక్షకులకే కాదు తమిళ ప్రేక్షకులకి తన పనితనం చూపించి అక్కడ కూడా తనకు తిరుగులేదని అనిపించుకోవాలని అనుకుంటున్నాడట...మరి ఈ 'ఈగ" రాజమౌళి అంచనాలను ఎంతవరకు నిజం చేస్తుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











