twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూదులతో గుచ్చిపిస్తున్న రాజమౌళి!

    By Bojja Kumar
    |

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్వరలో 'ఈగ' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 5 లేదా 12న విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్నా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. సాంకేతిక విలువలతో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారత దేశంలో ఇదివరకెన్నడూ లేని విధంగా రాబోతోందని అంటున్నారు.

    ఆ విషయం పక్కన పెడితే...రాజమౌళి సినిమాల్లో అందరినీ ఎక్కువగా ఆకర్షించేది ఆయన సినిమా హీరో చేతుల్లో ఉండే ఆయుధం. సింహాద్రి, చత్రపతి, విక్రమార్కుడు చిత్రాల్లో హీరో కోసం ప్రత్యేకంగా ఆయుధాలను డిజైన్ చేయించాడు జక్కన్న.

    తాజాగా 'ఈగ' సినిమాలో కూడా ఆయుధాన్ని చేర్చాడు ఈ దర్శకుడు. ఈ చిత్రంలో హీరో నాని అయినా సినిమా ప్రారంభం అయిన కొంత సేపటికే నాని విలన్ చేతిలో చని పోతాడు. దీంతో నాని ఆత్మ ఈగలో దూరుతుందట. విలన్ పవర్ ఫుల్ కాబట్టి ఈగ చేతిలో 'సూది'ని ఆయుధంగా పెట్టాడు. బహుషా ఆ సూదితోనే విలన్‌ను ఈగ గుచ్చి గుచ్చి చంపుతుందేమో..? చూడాలి.

    English summary
    Director Rajamouli upcoming flick Eega. In this movie ‘Eega’ weapon is Needle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X