జక్కన్న పేరు నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాజమౌళి..!
మగధీర వచ్చిన ఏడాది తర్వాత 'మర్యాద రామన్న" చిత్రాన్ని విడుదల చేసిన రాజమౌళి ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టే లోపు తక్కువ బడ్జెట్ లో, తక్కువ రోజుల్లో, ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తానంటూ 'ఈగ" మొదలు పెట్టాడు. అయితే మర్యాద రామన్న రిలీజయి పదిహేను నెలలు దాటినా కానీ ఇంకా 'ఈగ" చిత్రానికి రెక్కలొచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ ఈగ ఏప్రిల్ కి గానీ విడుదలయ్యేలా లేదు.
ప్రమోగాత్మకమని మొదలు పెట్టిన ఈగ చిత్రాన్ని కూడా రాజమౌళి తనదైన శైలిలో హై బడ్జెట్ చిత్రంగా మలిచాడు. దాంతో ఇప్పుడా సినిమాని విజయవంతం చేసేందుకు ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఈగ ఎప్పుడు పూర్తవుతుందో, ప్రభాస్ సినిమా కథ మీద ఎప్పుడు కూర్చుంటాడో, అసలు అది ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటికి విడుదలవుతో కూడా ఎవరికీ తెలీదు.
అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడా పేరు నిలుపుకోవడానికి ప్రతి సినిమానీ అదే పనిగా చెక్కుతూ తనకున్న జక్కన్న అనే మరో పేరుకి న్యాయం చేస్తున్నట్టున్నాడు..


Click it and Unblock the Notifications











