twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో చిరంజీవిని మించిన వారు లేరు: రాజమౌళి

    By Bojja Kumar
    |

    Recommended Video

    S. S. Rajamouli Extraordinary Speech @ Vijetha Audio Launch Event

    మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'విజేత'. మాళవికా నాయర్ హీరోయిన్. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌ సంగీతం అందించారు. ఆడియో వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ‌, రాజ‌మౌళి, అల్లు అర‌వింద్‌, ఎం.ఎం.కీర‌వాణి, సాయికొర్ర‌పాటి, క‌ల్యాణ్ దేవ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, సెంథిల్‌కుమార్ స‌హా ఇత‌ర‌ చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

     ఆయన బెస్ట్ జడ్జ్

    ఆయన బెస్ట్ జడ్జ్

    ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.... చిరంజీవిగారు మంచి డాన్సర్, మంచి ఫైటర్, మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు. ఆయనకు ఉన్న స్పెషల్ స్కిల్ స్టోరీ జడ్జ్ చేయడం, ఈ విషయం ఇండస్ట్రీ వారికి మాత్రమే తెలుసు. ఆయన స్టోరీ విన్న వెంటనే అందులో ఏం తప్పులు ఉన్నాయి, ఎలాంటి కరెక్షన్స్ చేయాలి, దేన్ని హైలెట్ చేయాలి, దేన్ని తగ్గించాలనేది చెబుతారు. ఈ విషయంలో ఆయన్ను మించిన జడ్జి లేరు అన్నారు.

     అందరిలోనూ కాన్ఫిడెన్స్ వచ్చింది

    అందరిలోనూ కాన్ఫిడెన్స్ వచ్చింది

    మగధీర స్టోరీ మొదట చిరంజీవి గారికే చెప్పాను. ఆయన అప్రూవ్ తీసుకునే ఆ సినిమా చేశాము. విజేత సినిమాకు కూడా చిరంజీవిగారు కథ విని చాలా బావుందని చెప్పిన తర్వాతే మొదలైంది. ఆయన ఓకే చెప్పడంతో అందరిలోనూ కాన్ఫిడెన్స్ వచ్చింని రాజమౌళి అన్నారు.

     సాయి కొర్రపాటి కాంప్రమైజ్ కాలేదు

    సాయి కొర్రపాటి కాంప్రమైజ్ కాలేదు

    కథ అనేది ఒక కంటెంట్. దాన్ని క్వాలిటీగా ప్రజంట్ చేయాలి. క్వాలిటీ లేకుంటే ప్రజలకు రీచ్ అవ్వడం చాలా కష్టం. సాయి కొర్రపాటి ఏ సినిమా చేసినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా బిగినింగులో కథ చెప్పినపుడు చిన్న కథ అని చెప్పారు. టెక్నీషియన్స్ ఎవరు అనుకుంటున్నారు? అని నేను అడిగినపుడు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ అని వారు చెప్పగానే ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని అర్థమైంది అని రాజమౌళి వెల్లడించారు.

    ఆయనంత పేరు రావాలి

    నేను సినిమాలో ఏమీ చూడలేదు. నాకు ఫస్ట్ వినిపించింది కోడి పాట. మా ఆవిడకు అసలు పాటలంటే పడవు. కానీ ఈ పాట విని చాలా బావుందని చెప్పంది. మా అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చేసింది. ఇంట్లో వారంతా చాలా బావుందని చెప్పారు. ఈ సినిమాలో అన్ని విభాగాలు కంబైన్డ్ గా బాగా వర్క్ చేశారు. అపుడు ‘విజేత' చిరంజీవికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో కళ్యాణ్ దేవ్ కు ఈ ‘విజేత' అంత పేరు తేవాలని కోరుకుంటున్నాను... అని రాజమౌళి తెలిపారు.

    English summary
    S. S. Rajamouli wishes team Vijetha the very best of luck. Kalyaan Dhev, Chiranjeevi’s son-in-law will foray into acting with Rakesh Sashi directorial Vijetha. Also starring Malvika Nair in the female lead role, Vijetha is being produced by Sai Korrapati under the banner Vaarahi Chalana Chitram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X