»   » రాజమౌళి మామూలోడు కాదు, డబల్ మిలియనీర్...!

రాజమౌళి మామూలోడు కాదు, డబల్ మిలియనీర్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ రేంజిలో ఉన్నాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు ఎంత పెద్ద దర్శకుడైనా స్టార్ హీరోల డేట్స్ కోసం వారి చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటే....రాజమౌళి విషయంలో మాత్రం ఇది పూర్తి రివర్స్. ఆయనతో సినిమా చేసే అవకాశం కోసం పలువురు స్టార్ హీరోలే రాజమౌళి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి.

  కేవలం సినిమాల పరంగానే కాకుండా...స్టార్ హీరోల మాదిరిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంది. తాజాగా ఆయన్ను ఫోలో అయ్యే వారి సంఖ్య 2 మిలియన్ల (20 లక్షలు)కు చేరుకుంది. ఫాలోవర్స్ సంఖ్య 2 మిలియన్స్‌కు చేరిన సందర్భంగా రాజమౌళి అందరికీ థాంక్స్ చెప్పారు.

  సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన 'బాహుబలి' అనే సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా గడుపుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు...ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా ఈచిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్, రానా, అనుష్క ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి కెరీర్లో ఇప్పటి వరకు 9 సినిమాలు వచ్చాయి. అన్నీ హిట్ అయ్యాయి. వాటికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

  రాజమౌళి

  రాజమౌళి

  రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ యువ దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత.

  స్టూడెంట్ నెం.1 (2001)

  స్టూడెంట్ నెం.1 (2001)

  జూ ఎన్‌టి‌ఆర్, గజాలా, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. కొన్ని కారణాల వల్ల జైలుపాలైన ఒక వ్యక్తి చదువుకుని లాయరై తన తండ్రిని ఒక తప్పుడు కేసునుంచి తప్పించి తన తండ్రి ఆదరణను తిరిగి పొందుతాడు అనేది ఈ చిత్రం కథాంశం.

  సింహాద్రి (2003)

  సింహాద్రి (2003)

  జూ ఎన్‌టి‌ఆర్, భూమిక, అంకిత, నాజర్, ముఖేష్ రిషి ముఖ్య పాత్రలు పోషించారు. తన ప్రాణాలను కాపాడిన ఆ ఊరి పెద్దను దేవుడిలా కొలిచే ఒక యువకుడు అనుకోని సంఘటనల వల్ల కేరళకు వెళ్ళి అక్కడ అన్యాయాన్ని ఎదిరిస్తాడు.ఆ తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులే ఈ చిత్రం యొక్క కథాంశం.

  సై (2004)

  సై (2004)

  నితిన్, జెనీలియా, శశాంక్, రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఒక కాలేజీలో ఆర్ట్స్ మరియూ సైన్స్ గ్రూప్ విద్యార్థులు రగ్బీ ఆట ద్వారా తగువులాడుతుంటారు. వారి కాలేజిని కబ్జా చేసిన ఒక గూండతో పోరాడటానికి ఇరువర్గాలూ కలిసి వాడి జట్టుని ఆటలో ఓడించి తమ కాలేజిని దక్కించుకుంటారు.

  ఛత్రపతి (2005)

  ఛత్రపతి (2005)

  ప్రభాస్, శ్రియా, భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీలంక నుంచి విశాఖకు చేరి తన తల్లికీ, తనపై ప్రేమ లేని తమ్ముడికీ దూరమైన ఒక కుర్రాడు పెద్దవాడయ్యాక అక్కడి అన్యాయాలను ఎలా ఎదిరించి ఆ పేద ప్రజల నాయకుడౌతాడు. చివరిలో తన తల్లినీ, మారిన తన తమ్ముడినీ పొందుతాడు అనేది చిత్ర కథాంశం.

  విక్రమార్కుడు (2006)

  విక్రమార్కుడు (2006)

  రవితేజ, అనుష్క శెట్టి, అజయ్, వినీత్ కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. ఒక చిల్లర దొంగని ఒక పాప నాన్నా అని పిలుస్తుంటుంది. దీని వెనక ఉన్నది తెలిసాక ఆ పాప తండ్రి ఒక పోలీసనీ, ఆ పోలీసు హత్యచేయబడ్డాడని తెలుసుకుంటాడు. ఆ పోలీసు అచ్చం తనలాగే ఉండటంతో తనే ఆ ఊరికి వెళ్ళి అక్కడి సమస్యలను పరిష్కరించి ఆ పాపను పెంచుకుంటాడు.

  యందొంగ (2007)

  యందొంగ (2007)

  జూ ఎన్‌టి‌ఆర్, ప్రియమణి, మోహన్ బాబు, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం. ఒక దొంగ కొన్ని పరిస్తితులవల్ల యముడిని దూషిస్తాడు. ఆగ్రహించిన యముడు అతడి ఆయువు పూర్తవ్వక ముందే అతడిని నరకానికి రప్పిస్తాడు. ఇది తెలిసిన ఆ యువకుడికీ, యముడికీ మధ్య జరిగే సంఘర్షణలో ఆ యువకుడే గెలుస్తాడు.

  మగధీర (2009)

  మగధీర (2009)

  రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్. 17వ శతాబ్దంలో ఒక యువరాణి ఆ రాజ్యంలోని ఒక వీరసైనికుడిని ప్రేమించింది. కానీ వారి ప్రేమ ఆ యువరాణిపై కోరికతో ఉన్న తన బావ వల్ల ఓడిపోయి ఒకేసారి వారి మరణానికి దారి తీస్తుంది. 400 ఏళ్ళ తరువాత మళ్ళీ పుట్టాక అదే సమస్య వస్తుంది. కానీ ఈసారి వారి ప్రేమ గెలుస్తుంది.

  మర్యాద రామన్న (2010)

  మర్యాద రామన్న (2010)

  సునీల్, సలోని, నాగినీడు, సుప్రీత్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. తన ఇంటిగడప దాటేంతవరకూ శత్రువుని సైతం చంపని ఒక పెద్దమనిషి ఇంటికి ఒక అమాయకుడు సహాయం కోసం వెళ్తాడు. కానీ తను వాళ్ళ శత్రువు కొడుకని తెలిసిన తరువాత ఆ ఇంటి నియమాన్ని వాడుకుని చివరికి బయటపడి తన శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు ఇచ్చి ఆ పెద్దమనిషి కూతురిని పెళ్ళాడుతాడు.

  ఈగ (2012)

  ఈగ (2012)


  నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. తనని చంపినవాడిపై పగ తీర్చుకోవాలని ఈగ జన్మెత్తిన ఒక వ్యక్తి ఆ హంతకుడినుంచి తన ప్రేయసిని కాపాడి ఆ అమ్మాయి సహాయంతో ఆ హంతకుడిని చంపుతాడు. ఆ క్రమంలో ఆ ఈగ కూడా చనిపోతుంది. మళ్ళీ ఈగలా పుట్టిన ఆ వ్యక్తి ఆ అమ్మాయిని కాపాడుతూ ఉంటాడు.

  English summary
  Tollywood's top filmmaker SS Rajamouli has added another feather to his cap. The followers count on his official Facebook page surpassed 2 Million-mark. This is something no other director in the country have been able to achieve till date.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more