For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రోమ్ లో రాజమౌళి ఫ్యామిలీ(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియడ్ చిత్రం ‘బాహుబలి'. ఈ సినిమా యూనిట్ అందరూ నవంబర్ 30న బల్గేరియా ప్రయాణమయ్యారు. నెల రోజుల పాటు బల్గేరియాలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా...రోమ్ లో ఆగారు..అక్డ తీసుకున్న ఫొటో ఇది. బల్గేరియా వెళ్తున్నట్టు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన అఫీషియల్ పేస్ బుక్ పేజిలో పేర్కొని ఈ ఫొటోని అప్ లోడ్ చేసారు.

  ఈ ఫొటోలో మనం రాజమౌళి, రమ రాజమౌళి, వల్లి, సెంధిల్, కార్తికేయ లను చూడవచ్చు. అందరూ ఉత్సాహంగా ఉన్నా్రు. ఇక ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను స్పీడుగా పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి సంగీత అందిస్తున్న యం.యం.కీరవాణి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

  ‘బాహుబలి' పార్ట్ 1ను ఏప్రిల్ 17, 2015న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెకండ పార్ట్ ని కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చెయ్యనున్నారు.

  ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషలలో డబ్బింగ్ చేయనున్నారు.

  మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

  ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

  Rajamouli Family in Rome!

  ఇక ...

  కవచాలు, శిరస్త్రాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడే యోధుడిగా ప్రభాస్‌ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. 'మేకింగ్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

  'బాహుబలి' గా ప్రభాస్‌ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.

  రాజమౌళి కొత్త ఆలోచన:

  లైవ్‌ యాక్షన్‌ సినిమా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్‌ యాక్షన్‌ సినిమా. ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్‌ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.

  ఇలాంటి సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కష్టసాధ్యమైన పనే. అందుకే బ్లూమేట్‌ ఆధారంగా తీసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే కళ్లకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనపడేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి. ఆయన తాజా చిత్రం 'బాహుబలి' కోసం ఏఎండీ అనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థతో కలసి పని చేస్తున్నారు. ఈ పనిలో మరో సంస్థ మకుట కూడా పాలుపంచుకుంటోంది. ఏఎండీ తాజాగా ఓ మైక్రోచిప్‌ తయారు చేసే పనిలో ఉందట.

  ఓ చిప్‌లో మొత్తం ఎఫెక్ట్స్‌ను అప్‌లోడ్‌ చేసి దాన్ని కళ్లజోడుకు జోడించి చూస్తే బ్లూమేట్‌ మీద ఏమైతే విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మిక్స్‌ చేస్తారో.. అవి కనిపిస్తాయి. దీని వల్ల చిత్రీకరణ సులభతరమవుతుంది. రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

  English summary
  Selfie featuring Bahubali team shot in Rome while they were on their way to Bulgaria for the shooting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X