twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన రాజమౌళి తండ్రి

    |

    ప్రస్తుతం ఇండియా మొత్తంలో టాప్ మోస్ట్ సినిమా రైటర్స్ లో ప్రముఖంగా వినిపించే పేరు కే.విజయేంద్రప్రసాద్ ఆయన రాసిన ప్రతి సినిమా కథ ఏదో ఒక విధంగా సంచలనం సృష్టిస్తూనే ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అగ్ర నిర్మాతలు దర్శకులు హీరోలు అందరూ కూడా ఆయన వెంట కథలకోసం తిరుగుతున్నారు. అయితే విజయేంద్రప్రసాద్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందనే ఈ విషయంలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బాహుబలి రైటర్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

    ముఖ్యంగా అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక రైటర్ అంటూ రూమర్స్ చాలానే వచ్చాయి. అన్నిటికి ఒకటే సమాధానంగా విజయేంద్రప్రసాద్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ మిగతా వాళ్లకు పారితోషికం ఎంత ఇస్తున్నారు అనే విషయం గురించి నాకు తెలిస్తే నేను ఆ విషయంలో మొదటి స్థానంలో ఉన్నానా లేదా అనే విషయం నాకు అర్థం అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ డిమాండ్ చేస్తున్నాను అని అనుకోను. ఇక చాలా బిజీగా ఉన్నాను అని చాలామంది అనుకుంటారు. కానీ నేను అందరూ అనుకున్నట్టు అంత బిజీగా ఏమీ లేను. ఒకసారి కథ రాస్తే వెంటనే దర్శకుడికి అందజేస్తాను.

    అక్కడితోనే నా పని అయిపోతుంది తర్వాత ఏదైనా అవసరం ఉంటే ఒకటి రెండుసార్లు తప్పితే ఎక్కువగా పని ఉండదు. కథ ఇచ్చిన తర్వాత రచయితతో పెద్దగా పని ఉండదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత పూర్తి బాధ్యత దర్శకుడి పై నే ఉంటుంది.. అని విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.

    Rajamouli father k vijayendra prasad about his remuneration

    రాజమౌళి సినిమాల గురించి మాట్లాడుతూ.. రాజమౌళి ఎలాంటి కథ విన్నా కూడా ముందు తనకు తాను అద్భుతంగా ఉందని మనసులో అనుకుంటే ఆ కథను తెర పైకి తేవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కాస్త లోపం కనిపించిన కూడా అవసరం లేదని మొహం మీద చెప్పేస్తాడు. నేను రాసే కథలు వంద శాతానికి 10 శాతం కథలు మాత్రమే ఓకే చేస్తాడు. మిగతా 90 శాతం నచ్చలేదని అంటాడు. మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క సినిమా ప్రాణం పెట్టి పని చేశాడు. కథ చెప్పగానే తన మనసులో సినిమాలు మొత్తం ఒకసారి ఊహించుకుంటాడు.

    ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే వరకు తను అనుకున్నవన్నీ పర్ఫెక్ట్ గా తెరపైకి వచ్చేలా చేస్తాడు. నేను రాసిన ప్రతి కథకు రాజమౌళి అనుకున్నదానికంటే ఎక్కువ స్థాయిలోనే న్యాయం చేశాడు ఆ విషయంలో అతనికి మార్కులు ఇవ్వాలంటే 100కి 200లు ఇచ్చిన తక్కువే. ఇక ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలు.. సీతమ్మ తల్లి పై ఒక ప్రత్యేకమైన కథ రాస్తున్నాను అలాగే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందిన స్కూల్ టీచర్ బయోపిక్ పై కథ రాస్తున్నాను అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా పూర్తిచేయాల్సి ఉంది. మహేష్ బాబు ప్రాజెక్ట్ పై కూడా ఇంకా వర్క్ చేయాల్సి ఉందని వివరణ ఇచ్చారు.

    బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

    English summary
    In recent interview Vijayendra Prasad gave examples on the stories he offers to top star heroes. When it comes to Mahesh Babu, Vijayendra Prasad reacted in an unexpected way. He said that setting a story for a star hero like Mahesh Babu is very difficult and not an easy job.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X