స్వీట్ ఎక్కడుంటే చీమలు అక్కడే - రాజమౌళి ఎక్కడుంటే కమెడియన్స్ అక్కడే..!
సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాద రామన్న" చిత్రం ఇటీవలే విడుదలై విజయం సాధించిన విషయం మీకు తెలిసిందే. రాజమౌళికి సునీల్ మంచి ఫ్రెండ్ కావడంతో ఆయన ఈ సినిమా తీశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా...రాజమౌళికి అక్కడే అసలు సమస్య వచ్చిపడింది. ఇండస్ట్రీలో కామెడీ హీరోలు అయినా అల్లరి నరేష్, ఆలీ, వేణుమాధవ్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, తదితరులు రాజమౌళి వెంట పడుతున్నారట. వీళ్లంతా రాజమౌళి వెంట ఎందుకు పడుతున్నారంటే...నిన్న గాక మొన్న వచ్చిన సునీల్‌తో సినిమా తీసి హిట్టు సాధించారు కదా! మేం ఎప్పటి నుంచో తెలుగు తెరను అంటిపెట్టుకొని ఉన్నాము, మాతో కూడా ఒక భారీ యాక్షన్ చిత్రం తీయమని వెంటపడి వేదిస్తున్నారట. రాజమౌళి ఎక్కడుంటే అక్కడకు వచ్చి సార్...మాతో సినిమా తీయండి అంటూ విసిగిస్తున్నారట.
మర్యాద రామన్న సునీల్ సలోని రాజమౌళి అల్లరి నరేష్ ఆలీ వేణుమాధవ్ బ్రహ్మానందం maryada ramanna sunil saloni rajamouli allari naresh ali venu madhav brahmanandam


Click it and Unblock the Notifications