»   » కట్టప్పను బాహుబలి చంపడంపై రాజమౌళి స్పందన (వీడియో)

కట్టప్పను బాహుబలి చంపడంపై రాజమౌళి స్పందన (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి-ది బిగినింగ్' చిత్రంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలికి ఎంతోనమ్మకంగా ఉండే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో రెండో భాగంలో చూపిస్తామని చెప్పి ముగించారు. దీంతో జనాల్లో రెండో పార్టు చూడాలనే కోరిక మరింత ఎక్కువైంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న....దానికి ఫన్నీ సమాధానాలతో కొన్ని రోజుల పాటూ ఇంటర్నెట్లో హల్ చల్ చేసాయి.

ప్రస్తుతం ‘బాహుబలి-2' షూటింగులో బిజీగా ఉన్న రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.... కట్టప్ప బాహుబలిని చంపడం అనే ప్రశ్నకు ఒక్కమాటలో సమాధానం చెప్పలేమని, దాని వెనుక పెద్ద కథే ఉందని రాజమౌళి తెలిపారు.మరో ప్రశ్నకు స్పందిస్తూ భవిష్యత్తులో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తో కలిసి హిందీ సినిమాకు పని చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తాను బాహుబలి-2 చిత్రం షూటింగులో బిజీగా ఉన్నట్లు తెలిపిన ఆయన.... ప్రస్తుతానికైతే బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు, బాలీవుడ్లో సినిమా ఎప్పుడు చేస్తానో ఇప్పుడే చెప్పలేను అన్నారు.


బాహుబలి-2 షూటింగ్‌ డిసెంబర్లో మొదలై శరవేగంగా సాగుతోంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో యూ ఎస్ షెడ్యూల్‌కు వెళ్ళనున్న రాజమౌళి అండ్ టీం ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.


బాహుబలి ది బిగినింగ్‌కు సీక్వెల్‌గా బాహుబలి ది కంక్లూజన్ అనే చిత్రం తెరకెక్కుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోండగా, దీనిపై జక్కన్న తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు. కంక్లూజన్ అనేది సీక్వెల్ కాదని, ఒకే కథని రెండు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

English summary
Ace director Rajamouli finally opens up on why Kattappa killed Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu