twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి కోసం ప్రభాస్ పెళ్లి వాయిదా!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో చేయడానికి టాలీవుడ్ యువ హీరోలంతా క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. అందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఛత్రపతి తర్వాత ఆ రేంజిలో హిట్ చూడని ప్రభాస్.....మరోసారి రాజమౌళి దర్శకత్వంలో చేసి తన స్టార్ ఇమేజ్ ను పెంచుకోవడానికి ఉవ్విల్లూరుతున్నాడు.

    రాజమౌళి కోసం తన పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా వాయిదా వేసుకున్నారంటే....రాజమౌళి దర్శకత్వంలో చేయడానికి ప్రభాస్ ఎంత కమిట్మెంటుతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ముందు రాజమౌళితో సినిమా, ఆ తర్వాతే పెళ్లి అని స్పష్టం చేసాడు. డిసెంబర్ నుంచి ఈచిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఈచిత్రం తనకెంతో ప్రతిష్టాత్మకమని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను కొరటాల శివ దర్శకత్వంలో సినిమా(వర్కింగ్ టైటిల్ వారధి) చేస్తున్నానని....ఈ చిత్రానికి ఫైనల్ గా త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని ప్రభాస్ వెల్లడించారు.

    ప్రభాస్-రాజమౌలి చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్కా మీడియా బేనర్‌పై నిర్మాత దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు.

    ఈచిత్రం ప్రభాస్ సరసన పరవ్ ఫుల్ విలన్ కోసం అన్వేషించిన రాజమౌళి చివరకు సుదీప్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. ఈ విషయాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

    English summary
    "Look I can either get married or do Rajamouli's film. I cannot do both at the same time. So, I had to choose between my wedding and the movie... And I picked the movie," Prabhas told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X