»   »  ఆ విషయం ఇన్నాళ్లకు గుర్తించాను: రాజమౌళి

ఆ విషయం ఇన్నాళ్లకు గుర్తించాను: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి నిన్న ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. నేను నా చిన్నప్పటి నుండి ఎన్నో వందల సార్లు మంత్రాయలం దర్శించాను. కానీ ఇన్నాళ్లు అక్కడ దేవాలయంలో శివలింగం ఉన్న విషయాన్ని గుర్తించనేలేదు. పూర్తి స్థాయి వైష్ణవాలయంలో శివలింగం ఉండటం ఆశ్చర్యమే అంటూ ట్వీట్ చేసారు.

బాహుబలి సినిమా విజయంతో మంచి జోష్ మీద ఉన్న రాజమౌళి.....తన ఫ్యామిలీ కలిసి పలు టూరిస్ట్ ప్రదేశాలు, దేవాలయాలు తిరుగుతూ రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి అనుభవాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘బాహుబలి' సినిమా విజయవంతంగా 3వ వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ చిత్రం షేర్ రూ. 100 కోట్లకు చేరువ కాగా, హిందీలో రూ. 70 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటి వరకు ఏ సౌతిండియన్ సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించలేదు. బాలీవుడ్ రెగ్యులర్ సినిమాలతో సమానంగా అక్కడ బాహుబలి సినిమా ఆదరణ లభిస్తుండటం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.

Rajamouli first time noticed

బాహుబలి పార్ట్ 1 విజయవంతం కావడంతో పార్ట్ 2 కోసం భారతీయ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' పార్ట్ -2 షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుంది. పార్ట్ 2కు సంబంధించి షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది, యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో సెకండ్ పార్ట్ రాబోతోంది. 2016లో ఈ సినిమా విడుదల కానుంది.

English summary
"I visited mantralayam hundreds of times since my childhood, but for the first time noticed a sivalingam inside the temple..a “SIVALINGAM” Inside a staunch vaishnava temple!!!" Rajamouli tweeted.
Please Wait while comments are loading...