రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటించే సన్నివేశాలు.. రాజమౌళి ఆలోచన ఇదే!
దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో భారీ చిత్రం ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి బాహుబలి తరువాత తెరకెక్కించబోతున్న చిత్రం కావడంతో కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి. నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
రాంచరణ్, ఎన్టీఆర్ వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి వీరిద్దరూ కలసి నటించే సన్నివేశాలని ముందుగా ప్రారంభించడం కుదరదు. రాంచరణ్ నటించే బోయపాటి చిత్రం నవంబర్ నాటికి పూర్తి కానుంది. ఎన్టీఆర్ నటించే అరవింద సమేత చిత్రం అక్టోబర్ నాటికి పూర్తవుతుంది.

దీనితో చరణ్, ఎన్టీఆర్ కలసి నటించాల్సిన సన్నివేశాల చిత్రీకరణని రాజమౌళి డిసెంబర్ లో ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనున్న ఈ చిత్రాన్ని 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రాజమౌళి సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











