సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ గాడి తప్పుతోందా..ఎందుకు తర్జనభర్జన..!?
'మగధీర" తర్వాత ఇమ్మీడియట్ గా మరో భారీ ప్రాజెక్ట్ టేకప్ చేయడం కరెక్ట్ కాదనుకున్న రాజమౌళి 'మర్యాద రామన్న" లాంటి చిన్న సినిమా చేశాడు. ఆ సినిమాతోను సక్సెస్ సాధించిన రాజమౌళి వెంటనే తన దారిలోకి వెళ్లకుండా మళ్లీ కాలయాపన చేస్తున్నాడు. ప్రేక్షకుల నాడి సరిగ్గా తెలిసిన ఏకైక దర్శకుడిగా కితాబులు అందుకుంటున్న రాజమౌళి 'అనవసరంగా" ఏడాది గ్యాప్ తీసుకుంటున్నాడు. నెక్స్ ట్ సినిమా ప్రభాస్ తో చేయడానికి కమిట్ అయిన రాజమౌళి ఉన్నపళంగా ప్రభాస్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో కావాలని తన కెరీర్ కి తాత్కాలిక బ్రేక్ వేసుకుంటున్నాడు.
'మగధీర" తర్వాతే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసి తను సెట్ చేసుకున్న బెంచ్ మార్క్ ని తనే ఛాలెంజ్ చేసుకోవడం పోయి, ఎస్కేపిజం ప్రదర్శించిన రాజమౌళి ఇప్పుడు పూర్తిగా గాడి తప్పుతున్నాడు. 'ఈగ" అనే ప్రయోగాత్మక చిత్రం చేయాలిని తహతహలాడిపోతూ కమర్షియల్ డైరెక్టర్ అయిన తాను ట్రాక్ మళ్లీపోతున్నాడు. అంతే కాకుండా నాగార్జున 'రాజన్న"కి, సునీల్ 'శివం"కి యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేయడానికి కమిట్ అయి తన 'స్టాంప్" మిస్ అయిపోతున్నాడు. అలాగే ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయాలనే విషయంలోనూ రాజమౌళి ఇంకా ఇక డెసిషన్ కి రాలేదు. 'మగధీర" మాదిరిగా భారీ సినిమా చేయాలా లేక 'ఛత్రపతి" లా మాస్ సినిమా చేయాలా అని ఇంకా తర్జనభర్జన పడుతున్నాడు.


Click it and Unblock the Notifications











