ఆ సినిమా వల్లే బాహుబలిలో ఛాన్స్.. అందులో పెర్ఫామెన్స్‌తో జక్కన్న ఆఫర్.. రానా కామెంట్స్

భారతీయ సినిమా చరిత్రలో బాహుబలికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చిత్రాలను ధీటుగా నిలబెట్టిన ఘనత బాహుబలిది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ డైరెక్టర్‌గా ఫుల్ ఫేమస్ అయ్యాడు. తెలుగు సినిమాలను,ఇక్కడి సాంకేతికతను తక్కువగా చూసే బాలీవుడ్ జనాలు.. మన హీరోలు, దర్శకుల దగ్గరికి వచ్చారు. బాహుబలి సినిమాను వారి భుజానికెత్తుకున్నారు. అంతలా మార్మోగిపోయిన బాహుబలి తెలుగు నాట ఓ సంచలనం. అందులో నటీనటులకు అంతకు ముందున్న ఇమేజ్ వెయ్యి రెట్ల కీర్తిని తీసుకొచ్చింది.

Recommended Video

Lockdown Leads To Prabhas Wedding || Actor Rana Comments
ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్లు..

ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్లు..

వంద కోట్లు, రెండు వందల కోట్లు, ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటూ ఎంతో మంది బాలీవుడ్ స్టార్లు టార్గెట్స్ పెట్టుకుని బరిలోకి దిగేవారు. అయితే ఏ ఒక్కరూ కూడా వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్ కాలేదు. కానీ బాహుబలి మాత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్లను కొల్లగొట్టేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి నూతన శకాన్ని రాసింది.

వెయ్యి రెట్ల ఇమేజ్

వెయ్యి రెట్ల ఇమేజ్

ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఎంతో గుర్తింపు వచ్చింది. ప్రభాస్, రానాలను ఇండియన్ స్టార్స్‌గా గుర్తిస్తున్నారు. దేశవిదేశాల్లో వీరిని స్టార్స్‌గా ఆరాధిస్తున్నారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో తనకు ఛాన్స్ ఎలా వచ్చిందో రానా చెప్పుకొచ్చాడు.

ఆ సినిమాను చూసి..

ఆ సినిమాను చూసి..

బాహుబలిలో తనకు అవకాశం ఎలా వచ్చిందో రానా చెప్పుకొచ్చాడు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో తన నటనను చూసి రాజమాళి బాహుబలిలో అవకాశం ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రానా మాత్రం నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X