నెటిజన్ల సాయం కోరిన రాజమౌళి.. దారుణంగా ట్రోల్స్.. ఆ మాత్రం చేయలేరా అంటూ!

ఈ మధ్య అన్ని విషయాలు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే కొన్ని విషయాలు పంచుకున్నప్పుడు అభిమానులు అభినందనలతో ముంచెత్తారు కానీ తమకు నచ్చని విషయాలు షేర్ చేసిన సమయంలో మాత్రం సదరు సెలబ్రిటీలను ఆడుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా ఆ లిస్టులో రాజమౌళి చేరారు. ఒక మహిళకు సహాయం చేయాలి అంటూ రాజమౌళి కోరుతూ చేసిన ట్వీట్ విషయంలో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే

ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా

ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర లేదు. శాంతినివాసం అనే సీరియల్ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తన కెరీర్ లో దాదాపు పదకొండు సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి ఒక్క ఫ్లాప్ సినిమా కూడా అందుకోలేదు అంటే ఆయన ట్రాక్ రికార్డ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా RRR అనే సినిమాని తెరకెక్కించారు.

RRR వాయిదా

RRR వాయిదా

నిజానికి ఈ సినిమా జనవరి ఏడవ తారీఖున సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని భావించారు కానీ అనూహ్యంగా జనవరి మొదటి నుంచి పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లు మూసివేతలు ప్రారంభమయ్యాయి. ఎందుకు వచ్చిన టెన్షన్ అని భావించిన సినిమా యూనిట్ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ సినిమాను విడుదల చేయడానికి రెండు డేట్లను సినిమా యూనిట్ ప్రకటించింది. ఆ రెండు డేట్లలో ఏదో ఒక రోజు సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు.

క్యాన్సర్ తో పోరాడుతూ

క్యాన్సర్ తో పోరాడుతూ

అయితే తాజాగా రాజమౌళి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆయన ఎలాంటి వివాదాస్పద పోస్ట్ పెట్టలేదు కానీ బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ లో కీలక పాత్ర పోషించిన దేవిక అనే మహిళ ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతుంది ఆమె వైద్యానికి ఆర్థిక సాయం చేయాలి అని ఒక క్యాంపైన్ కు సంబంధించిన లింక్ షేర్ చేసి డబ్బులు విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరారు. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలు అంత త్వరగా షేర్ చేయరు.

దారుణంగా ట్రోలింగ్

అయితే ఏమనుకున్నారో ఏమో రాజమౌళి ఈ విధంగా షేర్ చేయడంతో ఇప్పుడు నెటిజన్లు సాయం చేయకపోగా రాజమౌళిని దోషిగా చేసి అనేక విధాలుగా కామెంట్ చేస్తున్నారు.. కొందరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే నీకు ఆమెకు సాయం చేయాలి అనిపించడం లేదా? బాహుబలి లాంటి విజువల్ వండర్ కోసం పని చేసిన వ్యక్తి కి నువ్వు చేసే సాయం ఇదా? కోట్ల రూపాయలు ఈజీగా సంపాదించగలిగితే మీరు ఆమెకు సహాయం చేయకుండా మమ్మల్ని సాయం చేయమని కోరడం కరెక్టేనా అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

Recommended Video

RRR Movie టికెట్ ప్రైస్ రాజమౌలి డిసైడ్ చెయ్యాలి.. AP Govt కి ఎందుకు ? - RGV | Filmibeat Telugu
 అండగా కొందరు

అండగా కొందరు

అయితే మరి కొందరు రాజమౌళి ని సపోర్ట్ చేస్తున్నారు కూడా. రాజమౌళి ఆమెకు సాయం చేసి ఉండొచ్చు కానీ దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు ఇటీవల unstoppable with nbk షోలో బాలకృష్ణ తన బసవతారకం హాస్పిటల్ కోసం రాజమౌళి గుప్త దానాలు చేసిన విషయాన్ని ప్రస్తావించడంతో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ తెలుసుకోకుండా ఆయనని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఆయనకు అండగా నిలుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X