తమన్నా కోసం రాజమౌళి భారీ గిఫ్టు (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్ గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. ఈ చిత్రంలో తమన్నా కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా రాజమౌళి తమన్నాకు భారీ గిఫ్టును ఇచ్చాడు.

ఆ గిఫ్టు చూసి తమన్నా సైతం ఆశ్చర్యపోయింది. ఇంతకీ ఆగిఫ్టు ఏమిటో తెలుసా? చాక్లెట్. చాక్లెటే కదా అని తీసి పారేయకండి. దాని పొడవు ఏకంగా ఒక మీటరు. ఈ విషయాన్ని తమన్నా చెబుతూ, "బల్గేరియాలో సుదీర్ఘమైన ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత పేద్ద చాకొలేట్ ను నా కోసం తెప్పించి ఇచ్చారు. అసలు నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి వన్ మీటర్ చాకొలేట్ ను చూడలేదు" అంటోంది.

Rajamouli Gifted A Chocolate To Tamanna

ప్రభాస్, అనుష్క, దగ్గుబాటి రానా, తమన్నా, రమ్యక్రిష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్, కథ: వి.విజయేంద్రప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: ఎం.రత్నం, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X