ఫ్యామిలీతో రాజమౌళి గోవా ట్రిప్
హైదరాబాద్: రెండు సంవత్సరాల పాటు 'ఈగ' చిత్రం కోసం ఎడతెరిపి లేకుండా పని చేసిన రాజమౌళి ఎట్టకేలకు ఫ్రీ అయ్యారు. ఈగ చిత్రం విడుదలై మంచి విజయం సాధించడం, ప్రమోషన్స్ కూడా ముగియడంతో రాజమౌళి ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం గోవా బయల్దేరి వెళ్లారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడిస్తూ...రెండు సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ హాలిడే తీసుకుంటున్నా, మరో వారం రోజుల వరకు ట్విట్టర్లో అందుబాటులో ఉండక పోవచ్చు అని రాజమౌళి ట్విట్ చేశారు. హాలీడే నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభాస్‌తో తీయబోయే తన తర్వాతి సినిమాపై రాజమౌళి దృష్టి సారించనున్నాడు.
ఈ చిత్రం కాకతీయుల చరిత్రను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాజు పాత్రలో కనిపించనున్నారు. కాకతీయుల నేపథ్యంతో పాటు వివిధ రకాల నేపథ్యాలను యాడ్ చేసి ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్‌ను ఈచిత్రంలో రాజమౌళి సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నారు.
తను అనుకున్న కాన్సెప్టును పర్‌ఫెక్టుగా ప్రజెంట్ చేయడానికి రాజమౌళి చాలా కష్టపడతాడు. ఏదో కానిచ్చామని కాకుండా తనకు ఎవరూ వంక పెట్టకుండా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రమోగాత్మకంగా చేపట్టిన 'ఈగ' చిత్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నాడు. తీసుకుంటే తీసుకున్నాడు కానీ తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా దాన్ని రూపొందించారు. ప్రభాస్ చిత్రం పూర్తవడానికి కూడా లాంగ్ టైమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం చారిత్రక సీన్లతో కూడుకుని ఉండటం వల్ల చాలా స్టడీ చేయాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం మామూలే అనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











