రాజమౌళి ధాయలాండ్ ప్రయాణం
ఆ ట్వీట్ లో.... " మేం నలుగురం ఫ్యామిలీ హ్యాలిడీ ట్రిప్ గా ధాయ్ లాండ్ వెళ్తున్నాం. డిసెంబర్ 31 న వచ్చి మిగిలిన మా కుటుంబ సభ్యులతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటాం ," అన్నారు. ఇక గతంలోనూ రాజమౌళి ఈగ విడుదల అయిన తర్వాత తన కుటుంబంతో గోవా ట్రిప్ వెళ్లి వచ్చారు. అలాగే మర్యాద రామన్న చిత్రం విడుదల తర్వాత మెడిటెర్రానియన్ సీ కోస్ట్ కి హాలీడే ట్రిప్ గా వెళ్లారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి...తన తాజా చిత్రం ప్రభాస్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తి అయ్యి షూటింగ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ సైతం వేరే ఏ ప్రాజెక్టులూ ఒప్పుకోకుండా..ఒప్పుకున్న ప్రాజెక్టులు ఫినిష్ చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళ,తెలుగు,హింది భాషల్లో రూపొందనుందని సమాచారం. మర్యాదరామన్న నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజమౌళి గురువు...రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications












