»   » ఫ్యామిలీతో కలిసి రాజమౌళి వెకేషన్...

ఫ్యామిలీతో కలిసి రాజమౌళి వెకేషన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దాదాపు మూడేళ్లుగా రాజమౌళి క్షణం తీరిక లేకుండా గడిపాడు. ‘బాహుబలి' సినిమా కోసమే తన పూర్తి సమయం కేటాయించాడు. రాజమౌళి అండ్ టీం మూడుళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోంది. సినిమా రాజమౌళి ఊహించిన దానికంటే ఎక్కువే సాధించింది.

మూడేళ్ల పాటు తీరిక లేకుండా గడిపిన రాజమౌళి.... కాస్త రిలాక్స్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలో బాహుబలి పార్ట్ 2 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రిఫ్రెష్ అవ్వడానికి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ వెలుతున్నారట. త్వరలోనే మళ్లీ అంతా తిరిగి హైదరాబాద్ వచ్చి ‘బాహుబలి' పార్ట్ 2 పనిలో బిజీ అయిపోతారని తెలుస్తోంది. అయితే ఆయన వెకేషన్ ఎక్కడికి వెలుతున్నారు? అనేది తెలియరాలేదు.

Rajamouli goes on vacation

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

English summary
Rajamouli decided to take a small break and spend sometime with his family in a holiday spot.
Please Wait while comments are loading...