»   » 'బాహుబలి' హాట్ టాపిక్ : సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్

'బాహుబలి' హాట్ టాపిక్ : సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ రోజు బెనిఫిట్ షో లతో 'బాహుబలి'... చిత్రం విడుదలైంది. ఈ చిత్రం టాకేంటి, హైలెట్స్ ఏమిటి అనేదే ఇప్పుడు అందరి నోటా. ఎక్కడ చూసినా సినిమా ఎలా ఉంటుందో అన్న విషయంపైనే చర్చ. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ హైలెట్ విషయాన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ చిత్రంలో గెస్ట్ గా రాజమౌళి చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మహిష్మతి రాజ్య రక్షణకు చెందిన సైన్యం రహస్యాలను ఎత్తుకెళ్లిన వాళ్లకోసం రానా, ప్రభాస్ బయిలు దేరతాడు. దోపిడి దొంగలుండే ఓ ప్రాంతంకు వెల్లినప్పుడు అక్కడ రాజమౌళి ......మద్యం అమ్ముతూ కనపడతాడు. కొద్ది క్షణాలు సేపే రాజమౌళి కనపడినా మంచి రెస్పాన్స్ వచ్చింది.


Rajamouli guest role in Baahubali movie

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు 4000 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే విడుదలయ్యింది. మీడియాలో 'బాహుబలి' చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సామాజిక అనుసంధాన వేదికల్లోనూ 'బాహుబలి' తన సత్తా చాటుతోంది. ఫేస్‌బుక్‌లో 'బాహుబలి' పేజీకి 13 లక్షలకుపైగా లైక్స్‌ రాగా, ట్విట్టర్‌లో లక్షమంది అనుసరిస్తున్నారు.


ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో 40 లక్షలమందికిపైగా చూశారు. ఓ పక్క అంతర్జాలంలో ఈ సినిమా చేస్తున్న హల్‌చల్‌ ఈ స్థాయిలో ఉంటే, ఈ సినిమా ముందస్తు టిక్కెట్ల కోసం థియేటర్ల ముందు బారులు తీరిన జనసందోహాలే కనిపిస్తున్నాయి. మల్లీప్లెక్స్‌ల వద్ద పరిస్థితి మరీ దారుణం. దీని గురించి ఐమ్యాక్స్‌ ప్రతినిధి కిషన్‌ మాట్లాడుతూ ''ఓ సినిమాకి ఇంత భారీ ఎత్తున స్పందన వచ్చి చాన్నాళ్త్లెంది''అన్నారు.

English summary
Rajamouli play guest role in Baahubali movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu