ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనుకోలేదు..రాజమౌళి
'మగధీర' విజయం సాధిస్తుందని అనుకున్నాను కానీ, ఇంతటి ఘన విజయాన్ని మూటగట్టుకుని ఇన్నేసి రికార్డుల్ని క్రియేట్ చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు అని దర్శకుడు యస్.యస్.రాజమౌళి అన్నారు. మగధీర చిత్రం విడుదలై నేటికి ఏడాది కానుంది. సంవత్సరం రోజులుగా కర్నూలులోని లక్ష్మీ థియేటర్‌లో నాలుగు ఆటలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా రికార్డు నెలకొల్పిందని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది.ఈ సందర్బంగా రాజమౌలి ఈ విధంగా స్పందించారు. ఇక నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...'అభిమానుల్ని లా రికార్డులతో ఆనందపరిచిన మెగా చిత్రం 'మగధీర'ను మా బ్యానర్‌లో తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ఇలాంటి అరుదైన రికార్డు మా చరణ్‌కు దక్కినందుకు మెగా అభిమానులతో పాటు మా చిత్ర యూనిట్‌కి కూడా ఆనందంగా ఉంది' అన్నారు. ఇక మర్యాద రామన్న విజయయాత్రలో భాగంగా రాజమౌళి అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు.


Click it and Unblock the Notifications











