పద్మశ్రీ అవార్డులు: సంతోషం, బాధ వ్యక్తం చేసిన రాజమౌళి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావుకు చోటు దక్కడంపై పలువురు తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి కూడా కోటకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సంతోషం వ్యక్తం చేసారు. అదే సమయంలో ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఇప్పటికీ రాక పోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రాజమౌళి లాంటి ప్రముఖుడు బహిరంగంగా పద్మ అవార్డుల విషయంలో తన మనసులోని అసంతృప్తి వెల్లగక్కడం చర్చనీయాంశం అయింది. రాజమౌళి వ్యాఖ్యలను పలువురు సమర్థిస్తున్నారు. ముళ్లపూడి వెంకట రమణతో పాటు అనేక మంది తెలుగు సినిమా ప్రముఖులకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు దక్కలేదని అంటున్నారు.

రాజమౌళి తాజా సినిమా ‘బాహుబలి' విషయానికి కొస్తే ఈ చిత్రం టాకీ పార్టు షూటింగ్ పూర్తియింది. మరో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. సమ్మర్లో ‘బాహుబలి' పార్ట్ 1 విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.....అనుష్క, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, తమన్నా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











