twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన మార్క్ నా మీద ఉంటుంది: రాజమౌళి

    By Srikanya
    |

    ''నేను మొదట ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేరి తరువాత దర్శకత్వ శాఖలోకి వచ్చా. నాన్న గారి నుంచే ఎమోషన్స్ సీన్స్ ఎలా తీయాలో నేర్చుకున్నా. దర్శకత్వానికి సంబంధించి అ,ఆ లు నేర్చుకుంది ఆయన వద్దే. కాకపోతే నేను మొదట దర్శకుడినయ్యా. ఆయన కుమారుడిగా ఆయన మార్క్ నా మీద ఉంటుంది'' అంటూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పుకొచ్చారు. రాజన్న చిత్రం దర్సకత్వం గురించి అంతా రాజమౌళే మాట్లాడుతున్నారంటే ఆయన ఇలా స్పందించారు - ''అలాగే... రాజన్న సినిమాలో రాజమౌళి మార్క్‌ వుందని అందరూ అంటున్నారు. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ మార్క్ మాత్రమే ఉంటుంది. నా మార్క్ కాదు. గతంలో 'విక్రమార్కుడు'లో ధైర్యం గురించి చెప్పే డైలాగులు, 'మగధీర'లో హీరో వందమంది చంపే సీన్‌ని నాన్న చెప్పినప్పుడు నాకు ఎంతో ఈర్ష్య కలిగింది. నాకెందుకు ఆ ఆలోచన రాలేదనిపించింది. ఆ ఈర్షే నన్ను ఈ రోజు ఇలా నడిపిస్తోంది''. ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం బిజీలో ఉన్నారు.

    ఈగ సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.

    నాని, సమంత జంటగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేశ్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో 'నాన్ ఈ' పేరుతో రూపొందుతోంది. అని చెప్పారు రాజమౌళి. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫౌల్డ్స్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్. రవీందర్, స్పెషల్ ఎఫెక్ట్స్: అడిల్, స్టైలింగ్:రమా రాజమౌళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.

    English summary
    Rajamouli says ...Rajanna film credit goes to his father only.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X