రాజమౌళి కష్టపడుతున్నా.. హీరోలు మాత్రం కాలు బయటపెట్టడం లేదు!
దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా కోసం ఏ స్థాయిలో కష్టపడతాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక బిగ్ మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తెనున్నాడు. RRR సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మొన్నటివరకు ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా చూశారు. కానీ ఇప్పుడు కరోనా అడ్డు పడటంతో అభిమానుల్లో సగం ఓపిక నశించింది.
ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసిన జక్కన్న మిగతా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. దీంతో నెక్స్ట్ సమ్మర్ కి కూడా సినిమా పరిస్థితులు అనుకూలిస్తే తప్ప రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక కరోనా కారణంగా షూటింగ్స్ చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా రాజమౌళి రెండు రోజులు ట్రయల్ షూటింగ్ చేయాలని అనుకున్నాడు.

ఇప్పటికే షూటింగ్స్ చేసుకోవడానికి హైదరాబాద్ లొకేషన్స్ లోనే సెట్స్ వేసుకున్నారు. అయితే ముందుగా హీరోలను రప్పించకుండా అతికొద్ది మందితో టెస్ట్ షూట్ చేయాలని పీపీఈ కిట్లతో సిద్ధమయ్యారు. అయితే రాజమౌళి సిద్ధమైనప్పటికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ధైర్యం చేయలేకపోతున్నారట.
అవసరం అయితే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి రెడీ అంటున్నారట.. కానీ ప్రాణాలను రిస్క్ లో పెట్టలేమని ఇప్పట్లో షూటింగ్స్ కి రాలేమని క్లియర్ గా చెబుతున్నారట. కానీ రాజమౌళి మాత్రం కచ్చితంగా షూటింగ్స్ స్టార్ట్ చేయాలని మరిన్ని జాగ్రత్తల కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











