రాజమౌళి-ప్రభాస్ మూవీ లేటెస్ట్ ఇన్ఫో..
హైదరాబాద్: 'ఈగ' చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ బాధ్యతలు తీరడంతో ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ గడిపేందుకు గోవా వెళ్లి దర్శకధీరుడు రాజమౌళి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభాస్‌తో సినిమాకు సిద్ధమౌతున్న జక్కన్న అందుకు సంబంధించిన పనులు ప్రారంభించారు.
గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు.
ఈచిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ ల వచ్చిన ఛత్రపతి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











