twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడవి దొంగగా ఎన్టీఆర్.. రాంచరణ్ పని ఇదే.. ఇల్లు మార్చేసిన రాజమౌళి!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే. డివివి దానయ్య నిర్మాణంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. రాజమౌళి సినిమా అంటే సినీ వర్గాల్లో, అభిమానుల్లో కాస్త ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనేక ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రాంచరణ్, ఎన్టీఆర్ పోషించే పాత్రల విషయంలో లెక్కకు మించిన ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరో వార్త ఆసక్తిగా మారింది. ఆ వివరాలు చూద్దాం..

    బిజీ అయిపోయారు

    బిజీ అయిపోయారు

    గత ఎడారి నవంబర్ లో రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. చక చకా ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన తర్వాత కొడుకు పెళ్లి కోసం రాజమౌళి కొంత గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఎన్టీఆర్, రాంచరణ్ షూటింగ్ తో బిజీ అయిపోయారు. ఇక ఎలాంటి గ్యాప్ లేకుండా రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

    అడవి దొంగ

    అడవి దొంగ

    రాజమౌళి చిత్రాల్లో హీరో పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఎవరి పాత్ర ఏంటనే విషయంలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. తాజాగా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అడవి దొంగ పాత్రలో కనిపిస్తాడట. ఎన్టీఆర్ ని పట్టుకునే పోలీస్ గా రాంచరణ్ పాత్ర ఉండబోతోంది. ఈ డ్రామా మొత్తం 1920 కాలం నాటి పరిస్థితుల్లో జరుగుతుందని అంటున్నారు. మరణించి తిరిగి స్నేహితులుగా ప్రస్తుత్త కాలంలో పుడతారని కూడా కథ గురించి లీకులు వస్తున్నాయి.

    <strong>'ఆర్ఆర్ఆర్' సంగీతం ఎలా ఉంటుందో చెప్పిన కీరవాణి!</strong>'ఆర్ఆర్ఆర్' సంగీతం ఎలా ఉంటుందో చెప్పిన కీరవాణి!

    ఇల్లు మార్చేసిన రాజమౌళి

    ఇల్లు మార్చేసిన రాజమౌళి

    ఇక నుంచి ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ వేగంగా జరగనుంది. హైదరాబాద్ నగర శివారులో రెండు చోట్ల భారీ సెట్స్ నిర్మించారట. ఓ ప్రాంతంలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రెండు ఎకరాల స్థలాన్ని రెండేళ్ల కోసం లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ స్థలంలోనే రాజమోళి ఫ్యామిలీ, ఎన్టీఆర్, రాంచరణ్ కోసం అన్ని హంగులతో ఓ ఇల్లు నిర్మించారట. రాజమౌళి తన ఫ్యామిలీతో పాటు ఆ ఇంట్లోకి షిఫ్ట్ ఐపోయినట్లు తెలుస్తోంది. షూట్ చేసిన సన్నివేశాలని ఎడిట్ చేసేందుకు, పరిశీలించేందుకు ఆ ఇంట్లోని రాజమౌళి అన్ని సౌకర్యాలని సమకూర్చుకున్నారట.

    మరో భారీ నిర్మాణం

    మరో భారీ నిర్మాణం

    చిత్రంలో ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణుల సదుపాయాల కోసం ఆ సమీపంలోనే మరో భారీ సెట్ నిర్మించారట. నటీనటులకు ఈ సెట్ లోనే చిత్రానికి సంబంధిన శిక్షణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ఇంతవరకు రాంచరణ్, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ల పేర్లు ఖరారు చేయలేదు. త్వరలో ఆర్ఆర్ఆర్ కాస్టింగ్ కు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.

    English summary
    Rajamouli has completely shifted along with his family to be near the RRR sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X