'బాహుబలి' టీమ్ నుంచి ఇంకోటి...(వీడియో)

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి...భారీ స్ధాయిలో బాహుబలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రమోషన్ నిమిత్తం ఆయన తన సినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, నటీనటుల పుట్టిన రోజులకు వీడియోలు విడుదుల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వరసలో ఆయన ఇప్పుడు తమ చిత్రానికి పనిచేస్తున్న ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ గురించి తీసిన వీడియోని ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. ఆ వీడియోని మీరు ఈ క్రింద చూడవచ్చు.

Rajamouli has posted a video of DOP Senthil

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 2000 మంది కళాకారులపై చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

Post by Baahubali.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

ఇక ఈ చిత్రం కథ సైతం అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X