»   » బాహుబలి-2: రాజమౌళిని ఆకాశానికెత్తేస్తూ జూ ఎన్టీఆర్ వరుస ట్వీట్లు!

బాహుబలి-2: రాజమౌళిని ఆకాశానికెత్తేస్తూ జూ ఎన్టీఆర్ వరుస ట్వీట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమాపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందించారు. రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ వరుస ట్వీట్లు చేసాడు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు.

టాలీవుడ్ అగ్రహీరోల్లో బాహుబలి సినిమా గురించి స్పందించిన తొలి అగ్రహీరో జూ ఎన్టీఆరే. రాజమౌళి అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని అభిమానం..... ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తుల్లో రాజమౌళి ఒకరు. మరి రాజమౌళి గురించి, బాహుబలి 2 గురించి ఎన్టీఆర్ ఏమని ట్వీట్స్ చేసారో చూద్దాం.


ఇండియన్ సినిమా న్యూ లెవల్

ఇండియన్ సినిమా న్యూ లెవల్

బాహుబలి-2 సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఫైనెస్ట్ కాన్వాస్. రాజమౌళి కేవలం తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమాను ఒక న్యూ లెవల్‌కి తీసుకెళ్లాడు. హాట్సాఫ్ రాజమౌళి అంటూ జూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.


ప్రభాస్, రానాపై ప్రశంసలు

ప్రభాస్, రానాపై ప్రశంసలు

బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌తో రాజమౌళి విజన్ కు సపోర్టుగా నిలిచిన ప్రభాస్, రానా, అనుష్క, రమ్య కృష్ణ తదితరులపై జూ ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించాడు.


వారికిపై కూడా...

వారికిపై కూడా...

రాజమౌళి కల నిజం చేసేందుకు ఆయన అడిగినంత బడ్జెట్ పెట్టి సహకరించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్లను ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ ప్రశంసించారు.


జోరుగా బాహుబలి-2 ఫీవర్

జోరుగా బాహుబలి-2 ఫీవర్

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బాహుబలి-2 ఫీవర్ సాగుతోంది. బాహుబలికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.English summary
"Baahubali2 is Indian Cinema's finest canvas. ssrajamouli has taken not just Telugu Cinema, but Indian Cinema to a whole new level.Hats off. Kudos to Prabhas, RanaDaggubati , Anushka and meramyakrishnan for supporting ssrajamouli 's vision with brilliant performances. A big shout out to Shobu_ & Prasad who funded this dream & to all other actors and technicians who brought ssrajamouli 's vision to life." Jr NTR tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu