»   » తనకు అదంటే అసహ్యమని స్పష్టం చేసిన రాజమౌళి

తనకు అదంటే అసహ్యమని స్పష్టం చేసిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత దర్శకుడు రాజమౌళి చాలా మందికి హాట్ ఫేవరెట్ అయిపోయాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన భోజనప్రియుడు. ముఖ్యంగా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అయితే ‘జున్ను' అంటే మాత్రం రాజమౌళికి అస్సలు నచ్చదట.‘సైజ్ జీరో' ఆడియో వేడుకలో రాజమౌళి ఈ విషయం వెల్లడించారు. తన భార్య రమ తనను స్వీట్లకు వీలైనంత దూరంగా ఉంచుతుందని తెలిపారు.

సైజ్ జీరో సినిమా గురించి మాట్లాడుతూ...తూబాహుబలి సినిమా షూటింగ్ టైంలో ఓ రోజు అనుష్క ఈ సబ్జెక్ట్ ను నెరేట్‌ చేసింది. తను ఎగ్జయిటింగ్‌తో చెప్పిన పాయింట్‌ అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ తను మంచి సినిమా చేస్తున్నానని ఎగ్జయిట్ అవుతుందని అర్థమైంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ట్రైలర్ తోసినిమా చూడాలనే ఎగ్జయిట్‌మెంట్‌ కలిగించారు అన్నారు.

Rajamouli Hates Junnu

పివిపి సంస్థ అధినేత, ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ పొట్లూరి గారు మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో సినిమాను నిర్మించారు. అలాగే ప్రకాష్‌ కోవెలమూడి ఏ సినిమా చేసినా సిన్సియర్‌గా నమ్మి చేస్తాడు. కణిక మంచి స్టోరీని ప్రొవైడ్‌ చేసింది. ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది... అన్నారు.

English summary
Not many know that India's one of the most sought-after filmmaker SS Rajamouli is a big foodie "Except Junnu, I love all the sweets. Somehow I don't like Junnu. Since I'm a great lover of sweets, Rama always try to keep me away from sweets. I'm a big foodie," shared Rajamouli about his food habits, favourites on the lighter-note at the audio launch of Size Zero.
Please Wait while comments are loading...