2 లక్షలకు పెరిగిన రాజమౌళి బలం!
హైదరాబాద్ : బలం, బలగం ఉన్నోడే బలవంతుడు. సినిమా రంగం విషయానికొస్తే....ఎంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వాళ్లే నెంబర్ వన్. వాళ్ల సినిమాలకు క్రేజ్ ఎక్కువ. తాజాగా టాలీవుడ్లో టాప్ ప్లేసులో ఉన్న దర్శకుడు రాజమౌళి. తాజాగా రాజమౌళి మరో అరుదైన ఘనత సాధించాడు.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న దర్శకుల్లో ఏ దర్శకుడికీ లేనంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రాజమౌళిని ట్విట్టర్లో ఫాలో అయ్యే వారి సంఖ్య 2 లక్షలు క్రాస్ అయింది. రాజమౌళి సినిమాలన్నీ హిట్టవుతూ ఉండటం, ఈ మధ్య కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా రాజమౌళి పాలుపంచుకుంటుండమే రాజమౌళికి ఇంత క్రేజ్ రావడానికి కారణం. జులై నెలల లక్ష ఫాలోవర్స్ ఉన్న రాజమౌళి ఈ మూడు నెలల్లోనే మరో లక్ష్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం గమనార్హం.
ఇటీవలే 'ఈగ' చిత్రంతో హిట్ కొట్టిన రాజమౌళి...తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ హంగుళతో రూపొందుతున్న ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రంగా తీర్చిద్దేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












