ఆర్ఆర్ఆర్ కోసం 8 జాతీయ అవార్డుల విజేత.. ఇంకా ఎవరెవరంటే!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజీ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కించబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్ర రావు ముఖ్య అతిథులుగా ఈ వేడుక జరగడం విశేషం. ఎన్టీఆర్, చరణ్ తో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్, చరణ్ తప్ప ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల గురించి ఇంకా వివరాలు తెలియలేదు. కానీ రాజమౌళి సిబ్బందిని మాత్రం ఎంపిక చేసుకున్నాడు.

వాళ్లంతా కామన్
రాజమౌళి సినిమా అంటే తన కుటుంబ సభ్యులు కీలక పాత్ర వహించడం సహజం. కీరవాణి సంగీత దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తారు.

సినిమాటోగ్రఫీ అతడే
రాజమౌళి మగధీర, ఈగ, బాహుబలి రెండు భాగాలకు కెమెరా మాన్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ అందించనున్నారు. బాహుబలిలో భారీ చిత్రానికి సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన సంగతి తెలిసిందే.
8 జాతీయ అవార్డుల విజేత
ఈ చిత్రానికి ఎడిటర్ గా రాజమౌళి ఎంపిక చేసుకున్న వ్యక్తి ఆసక్తి రేకెత్తిస్తున్నారు. 8 సార్లు జాతీయ అవార్డు విజేతగా నిలిచిన శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటింగ్ భాద్యతలు చేపట్టనున్నారు. ఇటీవల శ్రీకర్ ప్రసాద్ భరత్ అనే నేను, సర్కార్, కాలా వంటి చిత్రాలకు ఎడిటింగ్ అందించారు. ప్రతిష్టాత్మక చిత్రాలు సాహో, సైరా నరసింహా రెడ్డికి కూడా అతడే ఎడిటర్.

అభిమానులంతా ఆసక్తిగా
ఎన్టీఆర్, చరణ్ మినహా ఇతర నటీనటుల్ని రాజమౌళి ఇంకా ప్రకటించలేదు. షూటింగ్ ప్రారంభమయ్యాక ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తే ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు ఎలా ఉంటాయి, వాళ్లిద్దరూ ఎలా నటిస్తారు అనే ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











