ఈగ ఎఫెక్ట్ : ఎఫ్‌బిలో రాజమౌళి రికార్డు
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మరో రికార్డు సృష్టించారు. ఈగ సినిమా సూపర్ హిట్ అయిన ఎఫెక్టుతో ఆయన్ను చాలా మంది సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఫాలో కావడానికి మక్కువ చూపుతున్నారు. తాజాగా రాజమౌళి ఫేస్‌బుక్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య లక్ష మార్కును దాటింది. మరో వైపు ఆయనకు ట్విట్టర్లో రెండు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రేంజిలో ఫాలోయింగ్ అంటే స్టార్ హీరోలకే సాధ్యం. హీరో కాక పోయినా సత్తా ఉంటే దర్శకుడు కూడా హీరోలను మించి పోతాడు అని నిరూపించారు రాజమౌళి.
అందరిలా కాకుండా ప్రత్యేకమైన సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న రాజమౌళి....ఈగ చిత్రంతో తన రేంజి మరింత పెంచుకున్నాడు. టాప్ హీరోలు ఉంటే తప్ప సినిమాలు తీయడం అంత సేఫ్ కాదని ఇతర టాప్ డైరెక్టర్లు మూస ధోరణితో వెలుతుంటే.....చిన్న హీరోలైనా, పెద్ద హీరోలైనా, అసలు హీరోలు లేకున్నా....సినిమాను హిట్ చేయొచ్చు, దర్శకుడిలో సత్తా ఉంటే ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేశాడు రాజమౌళి.
ఈగ చిత్రం తర్వాత రాజమౌళి ప్రభాస్‌తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఇకపై రాజమౌళి దర్వకత్వంలో యువ హీరోలు, చిన్న హీరోలనే తప్ప చిరంజీవి లాంటి పెద్ద హీరోలను చూడలేం. అలాంటి వాళ్లతో నాకు సెట్ కాదు అని ఇటీవలే తేల్చి చెప్పాడు జక్కన్న. అందుకు కారణం పెద్ద హీరోలు దర్శకుడు చెప్పినట్లు కాకుండా తమ సొంత నిర్ణయాలతో దర్శకత్వ శాఖలో వేలు పెట్టడమే. అందుకే రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని సర్వత్రా వినిపిస్తున్న వాదన.


Click it and Unblock the Notifications











