twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'పంజా' లో రాజమౌళి హ్యాండ్

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా లో రాజమౌళి హ్యాండ్ ఉందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం మేకింగ్ విషయంలోనూ,ప్రమోషన్ విషయంలోనూ రాజమౌళి ఇన్వాల్స్ అయ్యాడని చెప్తున్నారు.దానకి కారణం పంజా నిర్మాతలతో రాజమౌళికి ఉన్న అనుభంధమే అని చెప్తున్నారు. వారు అంతకుముందు రాజమౌళితో మర్యాదరామన్న చిత్రం తీయటం జరిగింది. ఇక బిజెనెస్ విషయంలోనూ రాజమౌళి దగ్గరుండి పంజాకి సహకరిస్తున్నాడని తెలుస్తోంది.ఇక పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎదురుచూస్తున్న చిత్రం పంజా.

    తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ దర్సకత్వంలో ముస్తాబై వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక పంజా ఆడియోని నవంబర్ రెండో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల సమయానికే నాగార్జున రాజన్న కూడా విడుదల అవుతుంది. ఇక క్లాష్ రాకుండా రెండు చిత్రాల విడుదల తేదీలు గ్యాప్ ఉండేటట్లు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంజా చిత్రం షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్, అడవి శేషు, అంజలీ మీద ఓ పబ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో బెల్లీ డాన్స్ స్పెషల్ గా ఉండబోతోంది. ఈ పాట పూర్తైన తర్వాత ఆడియోకి డేట్ ఫిక్స్ చేస్తారు. బిల్లా వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ తెలుగు తెరపై సంధిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఇది. నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాతలు. విజయదశమి పండగ సందర్భంగా సినిమా టైటిల్ (పంజా)తో పాటు హీరో ఫస్ట్‌లుక్ ను కూడా విడుదల చేశారు.

    ఈ చిత్రంలో అతని పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది. ఈ పాత్ర ఓ మాఫియా డాన్ ది కావటంతో ఆ పాత్ర పేరును పవన్ ఫిక్స్ చేసారు. సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్నారు.నిర్మాతలు నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ..పవన్‌ ఇమేజ్‌ దృష్ట్యా పవర్‌ఫుల్‌ టైటిల్‌ నిర్ణయించాం. కోల్‌కత నేపథ్యంలోని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. న్యూలుక్‌ ఉన్న సినిమా. క్రిష్‌, త్రీఇడియట్స్‌..చిత్రాలకు స్టంట్స్‌ కూర్చిన శ్యామ్‌ కౌశల్‌ అద్భుత యాక్షన్‌నిచ్చారు. 2పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు నడుస్తున్నాయి అన్నారు.

    English summary
    Entire production team of panjaa is known to have taken needful inputs from Rajamouli both in making and promotional stages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X