twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనంతపురం జిల్లాలో భారీగా పెట్టుబడులు పెట్టిన రాజమౌళి

    బాహుహుబలి సినిమా ద్వారా వచ్చిన డబ్బును రాజమౌళి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి అనంపురం రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి భూములను రిజిస్టర్ చేయించుకున్నట్లు సమాచారం.

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు భారీ విజయం అందుకున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాకు రానన్ని కలెక్షన్లు, లాభాలు ఈ చిత్రాలకు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడ్డ జక్కన్న తన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుని తద్వారా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

     భూములు రిజిస్టర్ చేయించుకున్న రాజమౌళి

    భూములు రిజిస్టర్ చేయించుకున్న రాజమౌళి

    తాజాగా అందిన సమాచారం ప్రకారం రాజమౌళి ఇటీవల అనంతపురంలోని సబ్ రిజిస్టార్ ఆఫీసుకు వచ్చారు. తను కొనుగోలు చేసిన భూములను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. రాజమౌళి వచ్చిన విషయం తెలిసి అభిమానులు అక్కడికి చేరుకునే లోపే ఆయన అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం.

    రాజమౌళి పెట్టుబడులు

    రాజమౌళి పెట్టుబడులు

    అనంతపురంతో పాటు హైదరాబాద్ సమీపంలో, విజయనగరం జిల్లాలో కూడా ఆయన భూములు కొనుగోలు చేశారట. కొన్ని రోజుల క్రితం రాజమౌళి 100 ఎకరాల భూమి కొన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

    నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలు

    నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలు

    సినిమాల విషయానికొస్తే రాజమౌళి త్వరలో డివివి దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇదో సోషల్ డ్రామాగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    మహేష్ బాబుబతో మూవీ

    మహేష్ బాబుబతో మూవీ

    మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో కూడా ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఇందుకోసం రాజమౌళి ఇంకా స్క్రిప్టు వర్క్ పూర్తి చేయాల్సి ఉంది.

    English summary
    Rajamouli is trying to plan wise investment of the money he earned. Yes, people of Anantapur were surprised to see Rajamouli infront of them. Rajamouli visited Anantapur Sub Registrar Office on Friday without any prior information.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X