twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళిది ఐరన్ లెగ్గా??

    By Staff
    |

    టాలీవుడ్ నెం.1 డైరెక్టరుగా వెలుగొందుతున్న దర్శకుడు రాజమౌళి. రాజమౌళి సినిమా అంటేనే సూపర్ హిట్ అని డిసైడైపోతున్నారు. ఆయన తో సినిమా కోసం ఎంతో మంది స్టార్ హీరోలు క్యూలో వున్నారు. ఆయనతో సినిమా చేస్తే ఏ హీరోకైనా ఓ సూపర్ హిట్ మూవీ తన ఖాతాలో పడిపోయినట్టే. కానీ అసలు చిక్కు ఆ తర్వాతే వస్తుంది. ఏ హీరోనైనా ఓ రేంజ్ లో చూపించడం రాజమౌళి ప్రత్యేకత. ఆ తర్వాత ఆ హీరో ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇక అటుపై వచ్చే చిత్రాలు కూడా అదే రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గినా సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంటుంది.

    ఇదే కోవలోకే వస్తారు ఎన్టీఆర్, ప్రభాస్. ఎన్టీఆర్ తో రాజమౌళి ఇచ్చిన 'సింహాద్రి' చిత్రాన్ని ఎవ్వరూ మరచిపోరు. ఆ సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ ఆకాశమంతగా ఎదిగిపోయింది, ఎన్టీఆర్ ను స్టార్ హీరోను చేసింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కు ఒక్క హిట్ కూడా రాలేదు. తనకి హిట్ ఇవ్వడానికి మరో సారి రాజమౌళి అవసరమయ్యాడు. 'యమదొంగ'తో కానీ అతనికి హిట్ రాలేదు.

    ఇక ప్రభాస్ పరిస్థితి కూడా అలాగే వుంది. 'ఛత్రపతి' సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత ఓ హిట్ సినిమా కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన 'ఛత్రపతి' లాగా 'యోగి' సినిమా తీసినా అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. పూరి 'బుజ్జిగాడు', గత చిత్రం 'బిల్లా' కూడా యావరేజి స్థాయిని మించలేకపోయాయి. త్వరలో రానున్న 'ఏక్ నిరంజన్' చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు ప్రభాస్. ఒక వేళ అది కూడా హిట్ కాకపోతే తిరిగి రాజమౌళితో చెయ్యబోయే 'విశ్వామిత్ర' సినిమాయే తన హిట్ కోరికను తీర్చాలి.

    కానీ ఈ కోవలో రవితేజ ఒక్కడే మినహాయింపు. 'విక్రమార్కుడు' చిత్రం తర్వాత కూడా రవి హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. మరి 'మగధీర'తో రామ్ చరణ్ ను సింహాసనం మీద కూర్చోబెట్టిన రాజమౌళి సిండోమ్ చరణ్ వదులుతుందో లేదో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X