»   » ఇక రాజమౌళి చుట్టూ బాడీ గార్డ్స్ రక్షణ కవచం

ఇక రాజమౌళి చుట్టూ బాడీ గార్డ్స్ రక్షణ కవచం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. తెలుగు సినిమా చిత్రలోనే కాదు, ఇండియన్ సినీ చరిత్రలో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా మారి పోయింది. అప్పటి వరకు తెలుగుకే పరిమితమైన ఆయన ఈ సినిమా తర్వాత నేషనల్ సెలబ్రిటీగా మారిపోయాడు. ఇండియానలోని ప్రముఖ నిర్మాతలంతా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

దీంతో ఆయనకు స్టార్ హీరోల మాదిరి ఇబ్బందులు మొదలయ్యాయి. ఎక్కడికెల్లినా జనాలు ఆయన్ను చుట్టు ముట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తన సెక్యూరిటీని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల ‘కంచె' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన రాజమౌళి చుట్టూ బాడీగార్డుల రక్షణలో కనిపించారు. అంతకు ముందు ఎప్పుడూ రాజమౌళి చెట్టు ఇలా బాడీగార్డుల రక్షణ కవచం కనిపించలేదు.

Rajamouli is now taking his security very seriously

రాజమౌళి త్వరలో ‘బాహుబలి-2' చేయడానికి సిద్ధమవుతున్నారు. . ఈ చిత్రం మొదట అనుకున్న తేదీన కాకుండా రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ కు ఫోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. స్క్రిప్టు ఇంకా ఫైన్ ట్యూన్ కాకపోవటమే ఈ లేటుకు కారణం అని తెలుస్తోంది. రాత్రింబవళ్లు ఈ స్క్రిప్టు పైనే పనిచేస్టున్నట్లు సమాచారం. మొదట జనవరి 8, 2016 న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు..కానీ ఇప్పుడు మారిందని చెప్పుకుంటున్నారు.

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

English summary
On Tuesday Rajamouli was invited to grace the trailer launch event of Kanche as the chief guest. He managed to raise quite some eyebrows at the venue when he turned up with bodyguards by his side.
Please Wait while comments are loading...